ప్లాస్టిక్ కవర్లు, బాక్సుల్లో ఆహారం తింటే ఇంత డేంజరా?
వేడిగా ఉన్న ఆహారం ప్లాస్టిక్ కవర్లు, పాత్రల్లో ప్యాక్ చేయడం.. నిల్వ చేయడం, ఆ ఆహారం తినడం ఆరోగ్యానికి హానికరం.
ప్లాస్టిక్‌లో బిస్పినాల్-ఎ (బీపీఏ) రసాయనం ఉంటుంది. ఇది అత్యంత హానికరమైన రసాయనం.
ప్లాస్టిక్‌ను మృదువుగా మార్చడానికి థాలేట్స్ అనే రసాయనం వాడతారు. కొన్ని ప్లాస్టిక్ కవర్ల తయారీలో పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ) వినియోగిస్తారు.
ఈ హానికారక రసాయనాలు శరీరంలో కలిస్తే.. ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల పనితీరు, పునరుత్పత్తి వ్యవస్థ, మెదడు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పిల్లలు, గర్భిణీలపై ప్రభావం అధికంగా ఉంటుంది.
హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలు వస్తాయి. మగవారిలో వీర్యకణాలు ఉత్పత్తి తగ్గుతుంది. మహిళల్లో గర్భధారణ సమస్యలు వస్తాయి.
ప్లాస్టిక్ కణాలు శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరుని దెబ్బతీస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికం.
పొట్టలోని సున్నితమైన పొరను దెబ్బతీయడంతో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.
ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రోగనిరోధక వ్యవస్థ, కాలేయం పనితీరును దెబ్బతీస్తుంది.
ప్లాస్టిక్‌లోని రసాయనాలు శరీరంలో ఎక్కువ కాలం పేరుకుపోతే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి.
ప్లాస్టిక్ పాత్రల్లో వేడి ఆహారం తినడం వల్ల శరీరంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావం పడుతుంది: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
ప్లాస్టిక్ డబ్బాల్లో, కవర్లలో వేడి ఆహారం వేయడం వల్ల ఆ రసాయనాలు ఆహారంలో కలిసి క్యాన్సర్‌తోపాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి: భారత వైద్య పరిశోధన మండలి
ప్లాస్టిక్ పాత్రల్లోని రసాయనాలు వేడికి కరిగి ఆహారంలో కలుస్తాయి. ఈ ఆహారం తింటే నాడీ వ్యవస్థ, మూత్రపిండాలు, కాలేయం మీద ప్రతికూల ప్రభావం పడుతుంది: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, యూఎస్ఏ