పచ్చి మామిడికాయ తింటే ఇన్ని లాభాలా..

పచ్చి మామిడి కాయలో అనేక పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇందులో విటమిన్ ఎ, సి, కె, బి6లతో పాటు ఫైబర్, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ తదితర ఖనిజాలు ఉంటాయి. 

వీటిలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

వేసవిలో వేడి వల్ల వచ్చే మలబద్ధకం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలను నివారిస్తుంది.

వీటిలో విటమిన్ ఎ, సి, ఇ, జింక్, ఐరన్ ఉంటాయి. జట్టుతోపాటు చర్మానికి అద్భుతమైన పోషణను అందిస్తాయి.

వీటిలోని విటమిన్ సి.. శరీరంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మంపై ముడతలు పడకుండా చేస్తుంది. వీటిలోని ఐరన్, జింక్ జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది.

వీటిలోని ఫైబర్, పొటాషియం.. రక్తపోటను అదుపులో ఉంచి.. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

పచ్చి మామిడికాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగవు.

వీటిలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఇది మధుమేహ రోగుల మెటబాలిజానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

శరీరంలో సోడియం క్లోరైడ్ చెమట రూపంలో వెళ్లి నీరసం వస్తుంది. పచ్చి మామిడికాయను కొద్దిగా ఉప్పు చల్లుకుని తిన్నడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతినదు.

పచ్చి మామిడి ముక్కలు నమలడం వల్ల లాలాజలం, పిత రసం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కాలేయాన్ని శుభ్రం చేయడంతోపాటు పేగుల్లోని బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు అరికడుతుంది.