కప్పు వేడివేడి కాఫీ తాగనిదే చాలా మందికి రోజు గడవదు.

కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

బ్లాక్ కాఫీ తాగితే దాని గరిష్ఠ ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.

బ్లాక్ కాఫీ అనేది కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.

కాలేయ కణాలను రక్షించి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది.

అల్జీమర్స్ వంటి భయంకరమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నిద్రలేచిన 90 నిమిషాల తర్వాత కాఫీ తాగితే చాలా మంచిది.

మధ్యాహ్నం 3 గంటల తర్వాత కాఫీ జోలికి వెళ్లకపోవడం ఉత్తమం.