ఈ చిటికెడు పొడితో షుగర్ కంట్రోల్..

మారేడు ఆకు పొడి లేదా బిల్వ పత్ర చూర్ణం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.

ఈ పొడి అజీర్ణం, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. పేగులను శుభ్రపరిచి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. 

ఈ పొడి.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది.

మారేడు ఆకుల్లోని గుణాలు రక్తపోటుతోపాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యానికి మంచిది.

ఈ పొడిలో విటమిన్ సీ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.

దీనిని పేస్ట్‌లా పొడిగా తీసుకుంటే చర్మంపై మంట, మొటిమలను తగ్గించి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఈ పొడిలో శీతలీకరణ గుణాన్ని కలిగి ఉంటుంది. వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం, వడదెబ్బ తగలకుండా ఉండటానికి సహాయపడుతుంది.

కాలేయాన్ని డిటాక్సిఫై చేయడంతోపాటు ఆ భాగం దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుంది.

సాధారణంగా 1/2 టీ స్ఫూన్ మారేడు ఆకు పొడిని గోరువెచ్చని నీటితో లేదా తేనెతో కలిపి తీసుకోవాలి.

ఏదైనా ఆరోగ్య సమస్యకు మందులు వాడే ముందు ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించడం మంచిది.