ఎముకల దృఢత్వానికి.. ఈ పొడిని మించింది లేదు.. 

ఆరోగ్యం, బలమని చాలా మంది ఆకు కూరలు, నాన్ వెజ్ తీసుకుంటారు.

ఒక్కొక్కసారి వివిధ రకాల పొడులు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. 

అందులో ఒకటి కంది పొడి. వీటిలో అధిక పోషకాలతోపాటు అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది.

కందిపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి, శరీరంలో శక్తికి ఎంతో సహాయపడతాయి. 

ఈ పొడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం. 

కంది పొడిలో ఫోలిక్ యాడిడ్, కాల్షియం, ఐరన్ ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వానికి, రక్తహీనత (అనీమియా) నివారణకు అద్భుతంగా పని చేస్తాయి.

కందిపొడిలో పీచు పదార్థం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.