అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘యోగాంధ్ర 2026’ కార్యక్రమాన్ని చేపట్టింది.
అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ యోగాసనాలు వేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
పతంజలి యోగా గురుకులం విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలను ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు.
బాబా రామ్‌దేవ్‌తో పాటు కలిసి చంద్రబాబు నాయుడు కూడా పలు ఆసనాలు వేశారు.
ఈ సందర్భంగా బాబా రామ్‌దేవ్ గుండవల్లి గుహల్లో ఉన్న అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. యోగా సాధనతో బాబా రామ్‌దేవ్ అద్భుతాలు సృష్టిస్తున్నారని తెలిపారు.
Related Web Stories
సింపుల్ చిట్కా: ఎముకల దృఢత్వానికి ఈ పొడి సూపర్
యాలకుల పాలు తాగితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
వర్షాకాలానికి సిద్ధం అవ్వండి.. ఆరోగ్యంగా ఉండండి..
పచ్చి మామిడికాయ తింటే ఇన్ని లాభాలా..