వీటితో థైరాయిడ్‌కు చెక్..

బ్రెజిల్ నట్స్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. 

ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందించి.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఈ నట్స్‌లో సెలీనియం ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడంతోపాటు హార్మోన్ల సమతుల్యతకు బాగా సహాయపడుతుంది. 

వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు (మోనశాచురేటెడ ఫ్యాట్స్)తోపాటు ఫైబర్ ఉంటుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి.. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆందోళన, డిప్రెషన్‌ను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి.

విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీరంలో మంటను తగ్గించి.. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణనిస్తాయి.

వీటిలోని విటమిన్ ఈ, సెలీనియం చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాకుండా.. జుట్టు, గోర్లు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. 

బ్రెజిల్ నట్స్‌లో సెలీనియం మోతాదుకు మించి ఉంటుంది. దీంతో రోజుకు 1 లేదా 2 నట్స్ తినడం ఆరోగ్యానికి మంచిది. 

బ్రెజిల్ నట్స్ అధికంగా తీసుకుంటే సెలీనియం టాక్సిసిటీ వచ్చే ప్రమాదం ఉంది. వైద్యుడిని సంప్రదించి తీసుకోవడం ఉత్తమం.