స్వాతంత్ర్య దినోత్సవంలో అపశృతి.. విద్యార్థి మృతి..
ABN, Publish Date - Aug 15 , 2026 | 08:36 PM
ఉత్తర్‌ప్రదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. సంభాల్ జిల్లా పబ్లిక్ స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదం జరిగింది.
లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. సంభాల్ జిల్లా పబ్లిక్ స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదం జరిగింది. కొందరు విద్యార్థులు జెండాను పాఠశాల భవనంపై ఏర్పాటు చేసేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ స్లాబ్ కూలిపోవడంతో విద్యార్థులు కిందపడ్డారు. అదే సమయంలో శిథిలాల కింద చిక్కుకుని ఆరేళ్ల చిన్నారి మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి
పనీర్, నెయ్యి సహా అనలాగ్ పాల ఉత్పత్తులపై పూర్తి నిషేధం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం..
Updated at - Aug 15 , 2026 | 08:36 PM