ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం..
ABN , Publish Date - Aug 15 , 2026 | 07:31 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఆయన బాధపడుతున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. ఈ మేరకు ఇవాళ (శనివారం) సాయంత్రం విజయవాడ లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ నిర్వహించిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఈరోజు ఉదయం కాకినాడలో నిర్వహించిన 80వ పంద్రాగస్టు వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు.
అనంతరం రాజమహేంద్రవరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను పవన్ ప్రారంభించారు. ఈ సమయంలో జ్వరం తీవ్రం కావడంతో కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేయడంతో ఉప ముఖ్యమంత్రికి కొంత ఉపశమనం కలిగింది. అనంతరం ఆయన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ కారణంగానే ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని లోక్‌భవన్ అధికారులకు డిప్యూటీ సీఎం పేషీ తెలియజేసింది. కాగా, ఇటీవల పవన్ తన కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి
విజయవాడలో రేపు డీఎస్సీ- 2025 ఉపాధ్యాయుల ర్యాలీ
ఎన్నికల్లో ప్రలోభాలకు గురికావొద్దని ప్రచారం చేయండి.. మహిళలతో సీఎం చంద్రబాబు