వర్షాకాలంలో సొరకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
ఇది సులభంగా జీర్ణమవ్వడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఇది వానాకాలంలో వచ్చే సాధారణ జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల కడుపు తేలికగా ఉంటుంది.
బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ మంచి ఆహారం.
మధుమేహం, కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
సొరకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సాయపడుతుంది.
ఇందులోని విటమిన్ ఎ, సి, కె, పొటాషియం వంటి పోషకాలు శరీర పనితీరు సక్రమంగా కొనసాగడానికి ఉపయోగపడతాయి.
Related Web Stories
వెల్లుల్లి పొట్టును పారేస్తున్నారా?.. లాభాలు తెలిస్తే ఇకపై అలా చేయరు!
రోజూ రాగి అంబలి తాగే వాళ్లకి.. ఈ సమస్యలేమీ రావు..!
ఐరన్ తక్కువగా ఉందా? చికెన్లో గోంగూర కలిపి తింటే ..
ఏ పండులో ఏ శక్తి ఉందో తెలుసుకుని తింటే ఆరోగ్యం మీ సొంతం..