వెల్లుల్లి పొట్టులో యాంటీఆక్సిడెంట్లు, సల్ఫర్, విటమిన్లు ఎ, సి, ఇ పుష్కలంగా ఉంటాయి.

పొట్టులో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి, బీపీ నియంత్రణకు సహకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వెల్లుల్లి పొట్టులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

వెల్లుల్లి పొట్టును సూప్స్, చారు తయారీలో మరిగించి తీసుకోవడం వల్ల మంచి రుచితో పాటు ఫైబర్ వంటి పోషకాలూ లభిస్తాయి.

వెల్లుల్లి పొట్టును బాగా ఎండబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి పొడి లేదా ఉప్పుతో కలిపి గార్లిక్ సాల్ట్ తయారు చేసుకోవచ్చు.

చికెన్ ఉడికించేటప్పుడు వెల్లుల్లి పొట్టును వేస్తే మంచి సువాసన రావడంతో పోషకాలు అందుతాయి.

వెల్లుల్లి పొట్టును నీళ్ల‌తో క‌లిపి పేస్ట్‌లా చేసి రాసుకుంటే  చ‌ర్మ సమస్యలు త‌గ్గే అవకాశం ఉంది.

వెల్లుల్లి పొట్టు వేసి మ‌రిగించిన నీళ్ల‌ను రాత్రి పడుకునే ముందు తాగితే మైండ్ రిలాక్స్ అవుతుంది.