గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టాలా? లేక బయట ఉంచినా సరిపోతుందా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది.

కొందరు ఎప్పుడూ ఫ్రిజ్‌లోనే నిల్వ చేస్తే.. మరికొందరు గది ఉష్ణోగ్రతలో ఉంచుతారు.

మరి ఇందులో సరైన పద్ధతి ఏది? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

గుడ్లను ఫ్రిజ్‌ డోర్‌లో కాకుండా లోపలి షెల్ఫ్‌లో ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకంటే డోర్‌ తరచూ తెరవడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది.

గుడ్లను చల్లని వాతావరణంలో వారం రోజుల వరకు బయట ఉంచవచ్చు.

గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటిలోని పోషకాలు ఏమాత్రం తగ్గవు. 

పైగా అవి ఎక్కువ కాలం తాజాగా, సురక్షితంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.