భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. మోదీకి పొందూరు ఖాదీ, బొబ్బిలి వీణతో సత్కారం
ABN, Publish Date - Aug 01 , 2026 | 03:17 PM
విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. విమానాశ్రయం రన్ వే మీద మొట్టమొదటగా ప్రధాని ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. టెర్మినల్ విభాగాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీప్‌లో బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. సభావేదికపై ప్రధాని మోదీనిని పొందూరు ఖాదీ కండువాతో సత్కరించిన సీఎం.. ఆపై బొబ్బిలి వీణను బహూకరించారు. బహిరంగ సభకు వెళ్లే సమయంలో 13500 మంది గిరిజన విద్యార్థినిలు, మహిళలు థింసా నృత్యంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.
1/10
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. టెర్మినల్ ప్రాంగణంలో ప్రధాని మోదీతో ఫొటో దిగిన గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, GMR ప్రతినిధులు.
2/10
టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్-ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను ప్రధాని మోదీకి వివరించిన జీఎమ్మార్ సంస్థ ప్రతినిధులు.
3/10
ఓపెన్ టాప్ జీప్‌లో సభా ప్రాంగణానికి చేరుకుని ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు.
4/10
బొబ్బిలి వీణను ప్రధానికి బహూకరించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేశ్.
5/10
పొందూరు ఖాదీ శాలువాతో ప్రధానిని సత్కరించిన సీఎం చంద్రబాబు.
6/10
సభా వేదికపై ప్రధాన మంత్రి మోదీ, సీఎం చంద్రబాబు.
7/10
సభా వేదికపై ప్రధానికి మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభివాదం.
8/10
ప్రధాని మోదీకి కరచాలనం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
9/10
బహిరంగ సభలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడితో ఏపీ మంత్రి లోకేశ్.
10/10
రూ.17,912 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ.
Updated at - Aug 01 , 2026 | 03:23 PM