భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

అతిపిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన ఈ సిక్సర్ల పిడుగు.. ఇప్పుడు వైస్ కెప్టెన్‌గా కీలక బాధ్యతలు అందుకోనున్నాడు.

ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ జట్టుకు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

అండర్ 19 ప్రపంచ కప్‌లోనూ వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఐసీసీ టీ20 ర్యాంకుల్లో కూడా వైభవ్ వేట మొదలుపెట్టాడు. ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన ఈ కుర్రాడు.. జింబాబ్వేపై చెలరేగి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.

వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేయడంతో ఏకంగా 230 స్థానాలు ఎగబాకి.. 278వ స్థానం నుంచి 48వ ప్లేస్‌కు దూసుకొచ్చాడు.