డబ్ల్యూపీఎల్ 2026 వేలం నాటి నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది లారెన్ బెల్.. ఇంతకీ ఎవరీమే?
డబ్ల్యూపీఎల్ వేలంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ లారెన్ బెల్‌ను రూ.90లక్షలకు సొంతం చేసుకుంది.
ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది.
ఇంగ్లండ్‌కు చెందిన లారెన్.. స్వింగ్, స్పీడ్‌ను చక్కగా కంట్రోల్ చేస్తుంది.
బౌలింగ్‌కి మాత్రమే కాదు.. ఆమె అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘WPL కొత్తందం’ అంటూ పొగిడేస్తున్నారు.
లారెన్‌కి ‘ది షార్డ్’ అనే ముద్దు పేరు ఉంది. పొడవుగా ఉండటంతో ఫ్రెండ్స్ షార్డ్ లండన్ బ్రిడ్జితో పోల్చేవారు.
ఫుట్‌బాల్, క్రికెట్ అంటే ఇష్టం. అకాడమీకి ఆడింది కూడా. కానీ ప్రాక్టీస్ రెండింటికీ ఒకేసారి ఉండటంతో క్రికెట్ వైపు వచ్చేసింది.
బంతితోనే కాదు జుట్టుతోనూ ప్రయోగాలు చేస్తుంది. ఆమె జడ వేసుకునే విధానానికి పెద్ద ఫ్యాన్స్ బేసే ఉంది.
సోషియాలజీ, క్రిమినాలజీతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువుకుంటూనే క్రికెట్ ఆడింది.
క్రికెట్ లేకపోతే ఫ్యామిలీ టైమ్.. లేదా పార్టీ టైమ్.. అంటూ సరదాగా గడిపిన ఆ ముచ్చట్లను ఇన్‌స్టాలో పంచుకుంటుంది.
Related Web Stories
ఆసీస్ తదుపరి కెప్టెన్ ఎవరు?
గబ్బర్‌కి కాబోయే భార్య.. అసలెవరీ సోఫీ!
2025లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్- 5 ప్లేయర్లు వీరే..
2025లో టెస్టుల్లో టాప్ బౌలర్లు వీరే..