గబ్బర్‌కి కాబోయే భార్య.. అసలెవరీ సోఫీ!

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్.. తన ప్రియురాలు సోఫీ షైన్‌ను ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

శిఖర్-సోఫీ గత కొంత కాలంగా రిలేషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఇంతకీ ఈ సోఫీ షైన్ ఎవరంటే..?

సోఫీ ఐర్లాండ్‌లో 1990లో పుట్టింది. మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసింది.

అబుదాబిలో నార్తన్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో ప్రొడక్ట్ కన్సల్టంట్‌గా పని చేసింది. ప్రస్తుతం ఆమె శిఖర్ ధావన్ సేవా కార్యక్రమాల సంస్థను నిర్వహిస్తోంది.

ఈ ఇద్దరూ దుబాయిలోని ఓ రెస్టరెంట్‌లో తొలిసారి కలిశారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతోంది.

సోఫీ ప్రపంచ దేశాల్లోని వివిధ ప్రదేశాలకు వెళ్లి ఆ జ్ఞాపకాలన్నింటినీ ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది.

స్టేడియంలో క్రికెట్ మ్యాచులు చూడడమంటే సోఫీకి ఎంతో ఇష్టమట. స్నేహితులతో కలిసి మైదానంలో సందడి చేస్తుంటుంది.

ఫిట్‌గా ఉండేందుకు యోగా,  స్విమ్మింగ్ చేస్తుంది. హెల్దీ డైట్  ఫాలో అవుతుంది.

హిందూ సంప్రదాయాన్ని ఇష్టపడే సోఫీ.. పండగ వేళల్లో చీర కట్టులో తళుక్కుమంటుంది.