గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం రేవంత్
ABN, Publish Date - Aug 15 , 2026 | 03:12 PM
భాగ్యనగరంలోని గోల్కొండ కోటలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
1/7
80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
2/7
ఈ సందర్భంగా ఆయన స్వాతంత్య్ర సమరయోదులను నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించారు.
3/7
జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి, తన ప్రభుత్వ 32 నెలల పాలనలో సాధించిన పురోగతిని, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
4/7
పేదవాడికి ఆకలి నుంచి విముక్తి.. రైతుకు అప్పుల నుంచి విముక్తి.. మహిళకు ఆర్థిక స్వేచ్ఛ.. యువతకు ఉపాధి.. బలహీన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే స్వాతంత్య్రానికి నిజమైన అర్థమని సీఎం అన్నారు.
5/7
తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన విధానాలు, చట్టాలు, భారీ ప్రాజెక్టులు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు బలమైన పునాదులు వేసిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
6/7
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించే కార్యక్రమాలు తలపెట్టిందని రేవంత్ తెలిపారు.
7/7
జాతీయ జెండా ఆవిష్కరణ కంటే ముందు సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో సైనిక స్మారకం వద్దకు వెళ్లిన సీఎం.. యుద్ధవీరులకు నివాళులు అర్పించారు.
Updated at - Aug 15 , 2026 | 03:15 PM