Share News

స్వాతంత్ర్య దినోత్సవం వేళ అమరావతి గ్రామాల్లో ప్రభుత్వ శకటాల సందడి..

ABN , Publish Date - Aug 15 , 2026 | 08:00 PM

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో ప్రభుత్వ శకటాల ప్రదర్శన సందడి నెలకొంది. అమరావతి పరేడ్‌ గ్రౌండ్స్‌లో శనివారం పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు శకటాలను ప్రదర్శించాయి. అనంతరం వాటిని రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో ప్రదర్శించారు.

స్వాతంత్ర్య దినోత్సవం వేళ అమరావతి గ్రామాల్లో ప్రభుత్వ శకటాల సందడి..
Amaravati Independence Day 2026

అమరావతి: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో ప్రభుత్వ శకటాల ప్రదర్శన సందడి నెలకొంది. అమరావతి పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఇవాళ (శనివారం) పంద్రాగస్టు వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలను వేడుకల్లో ప్రదర్శించారు.

Sakhatam.jpg


అయితే, ఈ కార్యక్రమం అనంతరం శకటాలను రాజధాని ప్రాంత గ్రామాల్లో ప్రదర్శించారు. శనివారం మధ్యాహ్నం నుంచి మల్కాపురం, వెలగపూడి, మందడం, వెంకటపాలెం, ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం గ్రామాల్లోని ప్రధాన రహదారుల మీదుగా శకటాల ప్రదర్శన కొనసాగింది. రంగురంగుల అలంకరణలతో రూపొందించిన శకటాలు గ్రామాల మీదుగా సాగడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. వీటి ద్వారా ఆయా ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

Sakhatam2.jpg


కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను శకటాలపై ప్రదర్శించిన తీరు పలు గ్రామస్థులను ఆకట్టుకుంది. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేలా శకటాల ప్రదర్శన సాగడంతో ప్రజలకు సమాచారం చేరువైనట్లయింది. వీటిని తిలకించేందుకు రాజధాని గ్రామాల ప్రధాన రహదారులపైకి పెద్ద సంఖ్యలో ప్రజలు పోటెత్తారు. కాగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం నిర్వహించిన ఈ శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Sakhatam3.jpg


ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం..

ఎన్నికల్లో ప్రలోభాలకు గురికావొద్దని ప్రచారం చేయండి.. మహిళలతో సీఎం చంద్రబాబు

Updated Date - Aug 15 , 2026 | 08:15 PM