కృష్ణా నదిలో గల్లంతైన ముగ్గురు యువకుల మృతి
ABN , Publish Date - Aug 15 , 2026 | 07:39 PM
విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన కృష్ణలంకకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతై మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
విజయవాడ: కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన విజయవాడలో విషాదం నింపింది. కృష్ణా నదిలో గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. కృష్ణలంకకు చెందిన గౌతమ్, జాషువా, తేజ ఈతకు వెళ్లిన సమయంలో నదిలో గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు చేపట్టిన గాలింపు చర్యల్లో మృతదేహాలు లభ్యమయ్యాయి.
ముగ్గురు యువకుల మృతదేహాలు బయటపడటంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనాస్థలంలో విషాదకర వాతావరణం నెలకొంది. ఈ ఘటన జరిగిన ప్రాంతం తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో కృష్ణలంక పోలీసులు తాడేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను తాడేపల్లి పోలీసులు సేకరిస్తున్నారు.
Also Read:
స్వాతంత్ర్య దినోత్సవం వేళ అమరావతి గ్రామాల్లో ప్రభుత్వ శకటాల సందడి..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం..