80వ స్వాతంత్ర్య దినోత్సవం.. దేశవ్యాప్తంగా ఘనంగా జెండా ఆవిష్కరణలు

ABN, Publish Date - Aug 15 , 2026 | 04:26 PM

దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని చాటుకున్నారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం.. దేశవ్యాప్తంగా ఘనంగా జెండా ఆవిష్కరణలు 1/12

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం.. దేశవ్యాప్తంగా ఘనంగా జెండా ఆవిష్కరణలు 2/12

ఎరుపు రంగుతో కూడిన సాంప్రదాయ రాజస్థానీ బాంధనీ తలపాగాను ధరించి ఆకట్టుకున్నారు. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ యువత లక్ష్యంగా పలు కార్యక్రమాలను ప్రకటించారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం.. దేశవ్యాప్తంగా ఘనంగా జెండా ఆవిష్కరణలు 3/12

ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజధాని ప్రాంతంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం.. దేశవ్యాప్తంగా ఘనంగా జెండా ఆవిష్కరణలు 4/12

హైదరాబాద్‌ లోని గోల్కొండ కోటలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం.. దేశవ్యాప్తంగా ఘనంగా జెండా ఆవిష్కరణలు 5/12

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చెన్నైలోని చారిత్రక ఫోర్ట్ సెయింట్ జార్జ్ ప్రాంగణంలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం.. దేశవ్యాప్తంగా ఘనంగా జెండా ఆవిష్కరణలు 6/12

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తన పాట్నా నివాసంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం.. దేశవ్యాప్తంగా ఘనంగా జెండా ఆవిష్కరణలు 7/12

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం.. దేశవ్యాప్తంగా ఘనంగా జెండా ఆవిష్కరణలు 8/12

కోల్‌కతాలోని చారిత్రక రెడ్ రోడ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువెందు అధికారి జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వేడుకల్లో పాల్గొన్నారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం.. దేశవ్యాప్తంగా ఘనంగా జెండా ఆవిష్కరణలు 9/12

న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం.. దేశవ్యాప్తంగా ఘనంగా జెండా ఆవిష్కరణలు 10/12

కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతి, సామరస్యం, సమ్మిళిత అభివృద్ధిని సాధించేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం.. దేశవ్యాప్తంగా ఘనంగా జెండా ఆవిష్కరణలు 11/12

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన నివాసంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భార్య అమృత ఫడ్నవిస్‌తో పాటు పలువురు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం.. దేశవ్యాప్తంగా ఘనంగా జెండా ఆవిష్కరణలు 12/12

అగర్తలాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

Updated at - Aug 15 , 2026 | 04:27 PM