ఏపీ లోక్‌భవన్‌లో ఘనంగా 'ఎట్ హోమ్' కార్యక్రమం

ABN, Publish Date - Aug 15 , 2026 | 06:37 PM

దేశ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విజయవాడలోని లోక్ భవన్‌లో 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఈ వేడుకను ఏర్పాటు చేశారు.

విజయవాడ, ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విజయవాడలోని లోక్ భవన్‌లో 'ఎట్ హోమ్' (At Home) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఈ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలో పలువురు ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను గవర్నర్, సీఎం దంపతులు ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Updated at - Aug 15 , 2026 | 07:31 PM