తక్కువ పెట్టుబడితో మంచి రాబడినిచ్చే పంటలు..

ఎల్ నినోతో వర్షాభావ పరిస్థితులు నెలకున్నాయి. ఆరు తడి పంటలు వేయాలని రైతులకు ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. తక్కువ కాలంలో స్వల్ప ఖర్చుతో చేతికొచ్చే పంటలు..

కొత్తిమీర.. ప్రతి ఇంటా దీనిని వినియోగిస్తారు. కేవలం 30 నుంచి 45 రోజుల్లో కోతకు వస్తుంది. రైతు.. నేరుగా పంటను విక్రయించి నగదు పొందవచ్చు. 

మెంతి.. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. మెంతి ఆకుతోపాటు గింజలకు మంచి డిమాండ్ ఉంది. తక్కువ నీటితో సాగు చేయవచ్చు. వీటిని నేరుగా మార్కెట్లు, ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో విక్రయించ వచ్చు. 

తులసి.. దీనిలో ఔషధ గుణాలు అధికం. ఆయుర్వేద, హెర్బల్ ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. తక్కువ పంటతో సాగు చేయవచ్చు. 3 నుంచి 4 నెలల దిగుబడి మొదలై.. నిలకడగా రాబడి ఇస్తుంది.

మిరప సాగు.. మంచి లాభాలు అందించే వాణిజ్య పంట మిరప. అంతర్జాతీయంగా కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది.

బంతి పూల సాగు.. శుభ కార్యాలయాలకు ఈ పూల డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. తక్కువ కాలంలోనే పంట చేతికి వస్తుంది. పండగ సీజన్లలో మరింత లాభాలను తెచ్చిపెడుతుంది.