నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. వేసవిలో నిమ్మకాయల వినియోగం అధికంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో వీటి ధర ఎక్కువగా ఉంటుంది.
వేసవిలో నిమ్మకాయలు కొంటే.. అవి తొందరా వాడిపోవడం కానీ.. ఎండి పోతుంటాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే.. నిమ్మకాయలను ఏకంగా నెల రోజులపాటు నిల్వ ఉంచవచ్చని అంటున్నారు.
ఒక గాజు సీసా లేదా ప్లాస్టిక్ డబ్బాలో నీటిని నింపి.. అందులో నిమ్మకాయలు వేయాలి. దానిని ఫ్రిజ్‌లో ఉంచితే నెల రోజులకు వరకు నిమ్మకాయలు చెడిపోవు. కాకుంటే.. రెండు లేదా మూడు రోజులకు ఒకసారి ఆ నీటిని మారుస్తూ ఉండాలి.
నిమ్మకాయలను విడిగా ఫ్రీజ్‌లో పెట్టడం కంటే.. జిప్‌లాక్ కవర్ లేదా గాలి చొరబడని ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరచడం ఉత్తమం. దీని వల్ల నిమ్మకాయల్లోని తేమ ఆవిరి కాకుండా ఉంటాయి. అవి త్వరగా ఎండిపోవు.
ఒక్కో నిమ్మకాయను విడివిడిగా న్యూస్ పేపర్‌లో లేదా టిష్యూ పేపర్‌లో చుట్టి.. ఆపై ఒక కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే అవి ఎక్కవ రోజులు పాడవకుండా ఉంటాయి.
పల్చని తొక్క ఉన్న నిమ్మకాయాల్లో రసం అధికంగా ఉంటుంది.
వెంటనే వాడాలనుకుంటే పసుపు రంగు నిమ్మకాయలు తీసుకోవాలి. కొంచెం ఆలస్యంగా వాడాలనుకుంటే మాత్రం లేత పచ్చ రంగులో ఉన్నవి తీసుకోవాలి.
వెంటనే వాడాలనుకుంటే పసుపు రంగు నిమ్మకాయలు తీసుకోవాలి. కొంచెం ఆలస్యంగా వాడాలనుకుంటే మాత్రం లేత పచ్చ రంగులో ఉన్నవి తీసుకోవాలి.