పుస్తకాలకు చెదలు పట్టకుండా ఉండాలంటే.. జస్ట్ ఇలా చేయండి
పుస్తకాలను తేమ లేని, వెలుతురు, గాలి బాగా తగిలే చోట ఉంచాలి. గోడలకు ఆనుకుని పెట్టవద్దు.
ఎందుకంటే గోడలకు చెమ్మ ఉంటే చెదలు తొందరగా వస్తాయి.
నెమలి ఈకలు, సొరచేప ఎముకలు వంటివి పుస్తకాల మధ్య ఉంచడం వల్ల చెదలు రాకుండా ఉంటాయి.
పాత పుస్తకాలను ఎండలో కొద్దిసేపు ఉంచి, దుమ్ము దులపడం మంచిది. ఇలా చేయడం వాటిని శుభ్రపరచడమే కాకుండా చెదలను సైతం నివారిస్తుంది.
అప్పుడప్పుడు పుస్తకాలు తీసి చూడడం, చదవడం లేదా వాటిని మరో స్థానంలో పెట్టడం వల్ల చెదలు పట్టే అవకాశం తగ్గుతుంది.
పాత పుస్తకాలను ప్రత్యేక సంచుల్లో పెట్టి.. ఆక్సిజన్ లేని వాతావరణంలో ఉంచడం వంటి పద్దతులు కూడా ఉన్నాయి. ఇది కొంచెం కష్టమైన ప్రక్రియ.
చెదలు పట్టకుండా ఉండటానికి ఇంట్లో చెక్క వస్తువులకు వాడే చిట్కాలను పుస్తకాలకు సైతం పాటించాలి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.
Related Web Stories
గ్యాస్‌ను వంద శాతం పొదుపు చేసే సింపుల్ చిట్కాలు..
రికార్డు సృష్టించిన మందుబాబులు
2025లో భారీ వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలు ఇవే..
ఇండిగో విమానాలు ఆలస్యం.. వేలాది మంది ఆకలితో నిరీక్షణ