గ్యాస్‌ను వంద శాతం పొదుపు చేసే సింపుల్ చిట్కాలు..

గ్యాస్ బండ ధర భారీగా పెరిగింది. బండ కొనుగోలు చేస్తే.. తిరిగి బ్యాంక్ అకౌంట్‌లో పడే నగదు కూడా స్వల్పంగానే ఉంటుంది. 

దాంతో గ్యాస్ బండను చాలా జాగ్రత్తగా వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు అనుసరించాల్సిన చిట్కాలు..

గ్యాస్ వెలిగించి పాత్ర, కావలసిన పదార్థాలు వెతుక్కోవడం చేస్తే మంట వృథా అవుతుంది. వాటిని వంటకు ముందే అందుబాటులో పెట్టుకోవాలి.

పెద్ద పాత్రలు, మూతలేని పాత్రల ఉపయోగిస్తే.. అధిక వేడి అవసరమవుతుంది. గంటకు 7.2 శాతం గ్యాస్ కోల్పోతాం. పాత్రలకు మూత ఉంటే గంటకు 1.45 శాతం గ్యాస్ ఆదా అవుతుంది.

ఉడికించే పదార్థాలకు ప్రెషర్ కుక్కర్లను వినియోగిస్తే.. 40 శాతం గ్యాస్ పొదుపు చేయవచ్చు.

పదార్థాలు పొంగినప్పుడు బర్నర్‌పై పడి కార్బన్‌తో రంధ్రాలు మూసుకుపోతాయి. దాంతో ఎర్రని మంట వస్తుంది. ఈ ఎర్రని మంట తక్కువ వేడినిస్తుంది.

అలాగే పాత్రల అడుగు భాగం మసిఅవుతుంది. దాంతో అధిక శాతం గ్యాస్ వాడాల్సి వస్తుంది. దాంతో స్టౌ బర్నర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉంటుంది.

రిఫ్రిజిరేటర్‌లో పెట్టిన ఆహార పదార్థాలను వేడి చేయాలంటే.. అరగంట ముందే వాటిని బయటకు తీసిపెట్టాలి. వండే సమయానికి పదార్థాలు గది ఉష్ణోగ్రతకు చేరుకోవాలి. లేకుంటే అధికంగా గ్యాస్ ఖర్చు అవుతుంది. 

తక్కువ ఆహార పదార్థాలను వండటానికి చిన్న బర్నర్ ఉపయోగిస్తే 6 నుంచి 10 శాతం గ్యాస్ ఖర్చు అవుతుంది.

తక్కువ లోతు ఉన్న వంట పాత్రలు వినియోగిస్తే.. తొందరగా వేడి బయటకు వెళ్లి గ్యాస్ వృథా అవుతుంది. లోతుగా ఉన్న పాత్రను వినియోగించడం ద్వారా గ్యాస్ దుబారా కాదు. 

బియ్యం, పప్పులను అరగంట ముందే నానబెడితే 22 శాతం గ్యాస్ ఆదా అవుతుంది. పదార్థాలు ఉడకగానే మంట తగ్గించాలి. 

స్టౌను ఉపయోగిస్తే.. 15 శాతం గ్యాస్ దుబారా అవుతుంది. ఐఎస్ఐ మార్క్ కలిగిన గ్రీన్ లేబల్ గ్యాస్ స్టౌలు ఉపయోగిస్తే 68 శాతం అధిక ఉష్ణోగ్రతను ఇస్తాయని పరిశోధనలో తేలింది.