నేతన్న సేవలో.. సీఎం చంద్రబాబు నాయుడు

ABN, Publish Date - Aug 08 , 2026 | 08:49 AM

చీరాల పరిధిలోని కొత్తపేటలో శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘నేతన్నల సేవలో..’ పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. చేనేత కేవలం ఒక వృత్తి కాదని భారతీయ సంస్కృతికి ప్రతీక అని సీఎం అభివర్ణించారు. ఇది దేశం గర్వించే కళ అని చెప్పారు.

 నేతన్న సేవలో.. సీఎం చంద్రబాబు నాయుడు 1/8

చీరాల పరిధిలోని కొత్తపేటలో శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘నేతన్నల సేవలో..’ పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు.

 నేతన్న సేవలో.. సీఎం చంద్రబాబు నాయుడు 2/8

చేనేత కేవలం ఒక వృత్తి కాదని భారతీయ సంస్కృతికి ప్రతీక అని సీఎం అభివర్ణించారు. ఇది దేశం గర్వించే కళ అని చెప్పారు.

 నేతన్న సేవలో.. సీఎం చంద్రబాబు నాయుడు 3/8

మన రాష్ట్రం చేనేత కళలకు నిలయమని గుర్తు చేశారు. నేతన్నలకు ఆసరాగా ఉండడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు.

 నేతన్న సేవలో.. సీఎం చంద్రబాబు నాయుడు 4/8

మంగళగిరిలో హ్యాండ్లూమ్‌ పార్కును తెస్తున్నామని ప్రకటించారు.

 నేతన్న సేవలో.. సీఎం చంద్రబాబు నాయుడు 5/8

అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

 నేతన్న సేవలో.. సీఎం చంద్రబాబు నాయుడు 6/8

విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ను నెలకొల్పుతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

 నేతన్న సేవలో.. సీఎం చంద్రబాబు నాయుడు 7/8

తీర ప్రాంతాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే అభివృద్ధికి ఆకాశమే హద్దని అన్నారు. సూర్యలంక నుంచి చీరాల వరకు ఉన్న 15 కిలోమీటర్ల దూరాన్ని ప్రత్యేక కారిడార్‌గా ప్రకటించే అవకాశం ఉందన్నారు.

 నేతన్న సేవలో.. సీఎం చంద్రబాబు నాయుడు 8/8

చీరాల సముద్ర తీరాన్ని మరో గోవాగా మార్చబోతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Updated at - Aug 08 , 2026 | 08:49 AM