ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Aug 02 , 2026 | 05:11 PM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
1/10
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లారు.
2/10
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.
3/10
ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
4/10
తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి తొలి బోనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు.
5/10
బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.
6/10
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దేవస్థానం అధికారులు సాధారణ భక్తుల కోసం మూడు క్యూ లైన్లు, బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
7/10
లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
8/10
ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తుతోపాటు ఎక్కడికక్కడ సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
9/10
దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా వాటర్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు.
10/10
అలాగే వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్స్, అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు.
Updated at - Aug 02 , 2026 | 05:15 PM