సంపన్నుల చేతుల్లో దేశ సంపద
ABN, Publish Date - Aug 12 , 2026 | 11:59 PM
కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం దేశ సంపదను కొంత మంది సంపన్నుల చేతుల్లో పెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు విమర్శించారు.
జమ్మికుంట, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం దేశ సంపదను కొంత మంది సంపన్నుల చేతుల్లో పెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు విమర్శించారు. సీపీఐ ప్రచార జాత బుధవారం జమ్మికుంటకు చేరుకుంది. ఈ సందర్భంగా రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ చౌరస్తా వరకు సీపీఐ నాయకులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ న్యాయం కోసం రోడ్డెక్కిన విద్యార్థులను మోదీ ప్రభుత్వం చిత్రహింసలు పెట్టిందన్నారు. బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా హామీలు ఇచ్చి నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణ శంకర్, జిల్లా కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, కర్రె భిక్షపతి, నాయకులు అందె స్వామి, కేదారి, అయిలయ్య, లక్ష్మి, సురేందర్‌రెడ్డి, అశోక్, లక్ష్మారెడ్డి, సృజన్‌కుమార్, బాబు, సమ్మయ్య, రాజు, బుచ్చన్న, పద్మ, అంజలి, రాజిరెడ్డి పాల్గొన్నారు.
Updated at - Aug 12 , 2026 | 11:59 PM