భాగ్యనగరంలో లష్కర్ బోనాలు.. అమ్మవారికి బోనం సమర్పించేందుకు పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Aug 02 , 2026 | 01:18 PM
భాగ్యనగరంలో లష్కర్ బోనాల సందడి నెలకొంది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు.
1/10
భాగ్యనగరంలో లష్కర్ బోనాల సందడి నెలకొంది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు.
2/10
బోనాలు సమర్పించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. క్యూ లైన్‌లో భక్తులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ పలకరించారు.
3/10
అమ్మవారిని బోనాలు సమర్పించేందుకు భక్తులు తరలి వచ్చారు.
4/10
సాధారణ భక్తుల కోసం 3 క్యూ లైన్లు, బోనాల సమర్పించే భక్తుల కోసం రెండు క్యూలైన్లు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు.
5/10
క్యూ లైన్‌లో భక్తులతో సెల్ఫీ తీసుకున్న విదేశీయులు.
6/10
చిన్నారులు కూడా అమ్మవారికి బోనం సమర్పించారు.
7/10
బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
8/10
అమ్మవారికి ఆదివారం తొలి బోనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. అలాగే అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.
9/10
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు.
10/10
ఆదివారం, సోమవారం రాత్రి అమ్మవారి ఫలహర బండ్ల ఊరేగింపు జరగనుంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో 2,500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అలాగే, అమ్మవారికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ దంపతులు బోనం సమర్పించారు.
Updated at - Aug 02 , 2026 | 01:36 PM