అమరావతిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు..
ABN, Publish Date - Aug 15 , 2026 | 02:51 PM
ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజధాని ప్రాంతంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
1/8
ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.
2/8
రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్‌లో స్వర్ణాంద్ర-2047 థీమ్‌తో వేడుకలు నిర్వహించారు.
3/8
రాజధానిలో జరుగుతోన్న 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.
4/8
సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుక జరిగే వేదిక వద్దకు సీఎం కాన్వాయ్‌తో బుల్లెట్ ఎస్కార్ట్ చేరుకుంది.
5/8
ఈ సందర్భంగా సీఎంకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు.
6/8
పోలీసు దళాల గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు. ఏపీఎస్పీ సహా వివిధ పోలీసు దళాల సన్నద్ధతను చంద్రబాబు సమీక్షించారు.
7/8
అనంతరం పోలీసు బలగాలు, ఎన్సీసీ క్యాడెట్లు, సీఆర్పీఎఫ్, కర్ణాటక పోలీసు దళం.. మార్చ్ పాస్ట్ నిర్వహించాయి.
8/8
ఆగస్టు 15 సందర్భంగా జాతీయ జెండాలతో చిన్నారుల సందడి నెలకొంది. దేశభక్తి నినాదాలతో స్వాతంత్ర్య వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Updated at - Aug 15 , 2026 | 02:51 PM