Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్..

ABN , First Publish Date - Jan 26 , 2026 | 07:28 AM

ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్..
Breaking News

Live News & Updates

  • Jan 26, 2026 21:56 IST

    ఫోన్ ట్యాపింగ్‌ కేసులో దోషులకు శిక్ష పడాలి: మహేశ్ కుమార్ గౌడ్

    • ఫోన్ ట్యాపింగ్‌లో అందరికీ నోటీసులు ఇవ్వాల్సిందే: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

    • ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత హేయమైన చర్య..

    • ఫోన్ ట్యాపింగ్‌ కేసులో పరిపూర్ణమైన విచారణ జరగాలి: మహేశ్ కుమార్ గౌడ్

      పూర్తి కథనం..

  • Jan 26, 2026 21:33 IST

    నేను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే: కోదండరాం

    • ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు..

    • ట్యాపింగ్ చేసినప్పుడు లేని భయం.. విచారణకు ఎందుకు..

    • మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై కాంగ్రెస్‌కు తమ అభిప్రాయం తెలిపాం: ప్రొఫెసర్ కోదండరాం

      పూర్తి కథనం..

  • Jan 26, 2026 21:29 IST

    అమెరికా స్కూల్లో సీఎం రేవంత్‌రెడ్డి కొత్త అధ్యాయం..

    • అమెరికాలోని హార్వర్డ్ కెనెడీ స్కూల్లో స్టూడెంట్‌గా మారిన సీఎం రేవంత్ రెడ్డి..

    • రాష్ట్ర పాలనలో ఆధునిక దృక్పథాన్ని అలవర్చుకునే దిశగా ఆయన ఈ శిక్షణలో పాల్గొన్నారు..

    • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6వరకు తరగతులు..

      పూర్తి కథనం..

  • Jan 26, 2026 21:17 IST

    మహిళ కన్నీళ్లు.. అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు..

    • గన్నవరం ఎయిర్‌పోర్టులో మనసుకు హత్తుకునే సంఘటన..

    • మహిళ కష్టం తెలుసుకుని చలించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

    • సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు..

      పూర్తి కథనం..

  • Jan 26, 2026 21:03 IST

    భారత్‌‌ ఎఫెక్ట్.. పాక్‌తో డీల్‌కు యూఏఈ కటీఫ్..

    • భారత్‌కు చేరువయ్యేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న యూఏఈ..

    • పాక్‌తో డీల్‌ను యూఏఈ రద్దు చేసుకున్నట్టు పాకిస్థాన్ మీడియాలో కథనాలు..

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 20:48 IST

    పాక్ ప్రధానితో భేటీ.. కీలక విషయాలు వెల్లడించిన నఖ్వీ..

    • పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ భేటీ..

    • టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనే అంశంపై సుదీర్ఘంగా చర్చించాం: నఖ్వీ

      పూర్తి కథనం..

  • Jan 26, 2026 20:44 IST

    బీజేపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా..

    • బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్..

    • త్వరలో బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించిన ఆరూరి రమేష్..

  • Jan 26, 2026 20:14 IST

    ప్రతి 20 నిమిషాలకు ఒక భారతీయుడి అరెస్ట్..

    • అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా..

    • అమెరికా సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం..

    • ప్రతి 20 నిమిషాలకు ఒక భారతీయుడి అరెస్ట్..

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 20:01 IST

    పాక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వార్నింగ్..

    • పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు..

    • ఐసీసీ మెగా టోర్నీకి పాక్ రాకపోవడమే మంచిది..

    • టీ20 ప్రపంచకప్‌లో పాక్ ఆడకపోవడమే ఉత్తమం: కృష్ణమాచారి

      పూర్తి కథనం..

  • Jan 26, 2026 19:56 IST

    ట్రంప్‌నకు ఝలక్... భారత్ టూర్‌కు కెనడా ప్రధాని..

    • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులను దీటుగా తిప్పికొడుతున్న కెనడా ప్రధాని మార్క్ కార్నే..

    • భారత్‌ పర్యటనకు సన్నద్ధమవుతున్న కెనడా ప్రధాని..

    • భారత్, కెనడా మధ్య ఉన్న సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యం..

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 19:49 IST

    రూ.2కోట్ల విలువైన సిగరెట్ల పట్టివేత..

    • కాకినాడ: కాకినాడలో రూ.2కోట్ల విలువైన నాన్ బ్రాండెడ్ సిగరెట్ల పట్టివేత..

    • తూరంగిలో ఓ ఇంట్లో 311 పెట్టెల్లో 3.65 లక్షల సిగరెట్ల నిల్వ..

    • పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్న విజిలెన్స్ అధికారులు.

  • Jan 26, 2026 19:16 IST

    బాలిక ఉసురు తీసిన చైనా మాంజా..

    • హైదరాబాద్‌: మరో బాలిక ఉసురు తీసిన చైనా మాంజా..

    • చైనా మాంజా గొంతుకు తగలడంతో ఐదేళ్ల బాలికకు తీవ్ర రక్తస్రావం..

    • ఆస్పత్రికి తరలించేలోపే బాలిక మృతి.

      పూర్తి కథనం..

  • Jan 26, 2026 18:44 IST

    సిట్ నోటీసులపై ఎంపీ సంతోష్ రావు స్పందన..

    • సిట్ నోటీసుపై స్పందించిన మాజీ ఎంపీ సంతోష్ రావు..

    • రేపటి విచారణకు హాజరవుతాను..

    • పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తాను.

  • Jan 26, 2026 18:42 IST

    అరుదైన చెత్త రికార్డుతో కోహ్లీ సరసన చేరిన సంజూ

    • టీమిండియా ఓపెనర్, వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు..

    • అత్యధిక గోల్డెన్‌ డకౌట్లైన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో సంజూ..

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 18:30 IST

    కొయ్యలగూడెంలో పులి సంచారం..

    • ఏలూరు: కొయ్యలగూడెం మండలంలో పులి సంచారం..

    • బిల్లిమిల్లి, డిప్పకాయలపాడు, మర్రిగూడెం, కిచ్చప్పగూడెం..

    • వంకాబొత్తప్ప గూడెం గ్రామాల పరిధిలో పులి సంచారం..

    • పులి సంచారంపై సమాచారం ఇవ్వడం లేదని.. అటవీశాఖ అధికారులపై స్థానికుల ఆగ్రహం.

  • Jan 26, 2026 18:24 IST

    మాజీ ఎంపీ సంతోష్‌రావుకు సిట్‌ నోటీసులు..

    • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ ఎంపీ సంతోష్‌రావుకు సిట్‌ నోటీసులు

    • రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో.. విచారణకు హాజరుకావాలని సిట్‌ నోటీసులు

      పూర్తి కథనం..

  • Jan 26, 2026 18:18 IST

    గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

    • హైదరాబాద్‌-విజయవాడ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ గుండెపోటుతో మృతి..

    • గుండెనొప్పితో చౌటుప్పల్‌ దగ్గర బస్సు ఆపిన డ్రైవర్‌ నాగరాజు..

    • ఆస్పత్రికి తరలించేలోపే డ్రైవర్‌ నాగరాజు మృతి.

  • Jan 26, 2026 18:17 IST

    రేపు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం..

    • రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం..

    • అఖిలపక్ష సమావేశానికి హాజరుకానున్న వివిధ పార్టీల లోక్ సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు..

    • జనవరి 28 వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

    • జనవరి 28 వ తేదీ నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

    • జనవరి 28 వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • ఫిబ్రవరి 1 వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

    • మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు .

  • Jan 26, 2026 18:08 IST

    మహారాష్ట్ర బీఎంసీ మేయర్‌పై ప్రతిష్టంభన.. ఫడ్నవిస్, షిండే భేటీ..

    • మేయర్ పదవి విషయంలో బీజేపీ, షిండే శివసేన మధ్య ప్రతిష్టంభన ..

    • బీఎంసీ మేయర్ ఎన్నిక ఈ నెలాఖరులో జరగాల్సి ఉండగా ఫిబ్రవరికి వాయిదా..

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 17:40 IST

    మేడారంలో న్యూజిలాండ్ కళాకారుల నృత్య ప్రదర్శన..

    • ములుగు: మేడారం గద్దెల ప్రధాన ద్వారం ఎదుట న్యూజిలాండ్ కళాకారుల నృత్య ప్రదర్శన..

    • హకా నృత్యం ప్రదర్శన ఇస్తున్న న్యూజిలాండ్ కళాకారులు..

    • కళాకారులతో కలిసి నృత్యాలు చేసిన మంత్రి సీతక్క.

  • Jan 26, 2026 17:37 IST

    భారత్‌కు శుభాకాంక్షలు తెలిపిన డొనాల్డ్ ట్రంప్..

    • భారత్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..

    • అమెరికా, భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు: డొనాల్డ్ ట్రంప్

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 17:28 IST

    ఈయూతో భారత్ ట్రేడ్‌డీల్..

    • ఐరోపా యూనియన్ నుంచి లగ్జరీ కార్ల దిగుమతిపై సుంకాన్ని తగ్గించేందుకు కేంద్రం అంగీకారం..

    • మంగళవారం దీనిపై ఒక ప్రకటన చేసే అవకాశం..

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 17:20 IST

    12 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు..

    • విశాఖ: పోక్సో కేసులో 12 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు

    • నిందితుడు సల్మాన్‌ను ఉత్తర్‌ప్రదేశ్ నుంచి విశాఖ తీసుకొచ్చిన పోలీసులు

    • 12 ఏళ్ల క్రితం బాలికపై అత్యాచారం చేసి పరారైన నిందితుడు సల్మాన్‌

  • Jan 26, 2026 17:19 IST

    ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు మహేష్‌గౌడ్‌, షర్మిల

    • AICC జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ నేతృత్వంలో..

    • అన్ని రాష్ట్రాల సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ సమావేశం..

    • హాజరైన పలు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, AICC ప్రధాన కార్యదర్శులు.

  • Jan 26, 2026 17:15 IST

    జూబ్లీహిల్స్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి శ్రీధర్ బాబు

    • ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం..

    • పెండింగ్‌ పనులను పూర్తి చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 17:03 IST

    కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే: ఎమ్మెల్సీ అద్దంకి

    • స్పీకర్‌ను అవమానించిన మాజీ మంత్రి కేటీఆర్‌ క్షమాపణ చెప్పాల్సిందే: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

    • సభాపతిని ధృతరాష్ట్రుడితో పోల్చడం ఏంటీ..

    • కేసీఆర్ రాజ్యాంగంతో తెలంగాణ వచ్చిందని చెబుతూ అవమానిస్తున్నారు: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

      పూర్తి కథనం..

  • Jan 26, 2026 16:59 IST

    ఏపీ లోక్ భవన్‌లో.. ఎట్ హోమ్

    • అమరావతి: ఏపీ లోక్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం

    • హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తదితరులు..

  • Jan 26, 2026 16:49 IST

    వావ్, పాముకు ఈ ట్యాలెంట్ కూడా ఉందా..

    • ప్రవహిస్తున్న నీటిలో పాము వేట..

    • తాడుపై వేలాడుతూ చేపను వేటాడిన పాము.. వీడియో వైరల్..

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 16:46 IST

    పీసీబీ ఛైర్మన్ నఖ్వీపై హర్భజన్ ఫైర్..

    • పీసీబీ ఛైర్మన్ నఖ్విపై టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం..

    • టోర్నీలో ఆడటం, ఆడకపోవడం బంగ్లాదేశ్ సమస్య.. పాకిస్థాన్‌ది కాదు..

    • అవసరం లేని చోట నఖ్వి జోక్యం ఎందుకంటూ ప్రశ్నించిన హర్భజన్..

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 16:42 IST

    ఆ ఆలయాల్లో ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం.!

    • బద్రీనాథ్‌, కేదార్‌నాథ్ ఆలయాల దర్శన విషయంలో కీలక మార్పులు..

    • ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతి..

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 16:37 IST

    బండ్ల గణేశ్‌కు మంత్రి నారా లోకేశ్ పరామర్శ..

    • తిరుమల పాదయాత్రలో కాలినొప్పితో బాధపడుతున్న నిర్మాత బండ్ల గణేశ్‌..

    • బండ్ల గణేశ్‌కు నారా లోకేశ్ ఫోన్..

    • పాదయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించిన లోకేశ్..

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 15:57 IST

    పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది వక్రబుద్ధి..

    • పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వక్రబుద్ధి..

    • భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కిన అఫ్రిది..

    • భారత్‌ను అనవసరంగా వివాదంలోకి లాగుతున్నాడని మండిపడుతున్న నెటిజన్లు..

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 15:53 IST

    ప్రపంచ స్థాయిలో గుర్తింపు.. అయినా మురికివాడలోనే..

    • ముంబైకి చెందిన మలీసా కార్వాకు సూపర్ మోడల్‌గా ఊహించని పాపులారిటీ..

    • కాస్మోపోలిటన్, వోగ్ వంటి మ్యాగజైన్స్ కవర్ పేజీల్లో కనిపించే స్థాయికి ఎదిగిన మలీసా కార్వా..

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 15:48 IST

    రిపబ్లిక్ డే వేడుకల్లో.. గుండెపోటుతో ఎస్ఐ కన్నుమూత..

    • మహారాష్ట్ర ధరాశివ్ జిల్లా ఉమర్గా టౌన్‌ గణంత్ర వేడుకల్లో ఎస్ఐ మోహన్ జాదవ్ గుండెపోటుతో మృతి..

    • అధికారులు, సిబ్బందితో కలిసి వందనం చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన ఎస్ఐ..

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 15:42 IST

    నేను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే: కోదండరాం

    • ట్యాపింగ్ చేసినప్పుడు లేని భయం.. విచారణకు ఎందుకు?: కోదండరాం

    • మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై కాంగ్రెస్‌కు మా అభిప్రాయం తెలిపాం..

    • సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది: కోదండరాం

    • సింగరేణిని కార్పొరేట్ శక్తుల చేతిలో బందీ చేయొద్దు: కోదండరాం

  • Jan 26, 2026 15:38 IST

    రేపు లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలవనున్న BRS నేతలు

    • కేటీఆర్ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలిసి...

    • సింగరేణి స్కామ్‌పై వివరాలు అందజేయనున్న నేతలు..

    • స్కామ్‌లో రేవంత్‌, భట్టి పాత్రపై ఫిర్యాదు చేయనున్న నేతలు..

    • సాక్ష్యాధారాలతో కూడిన నివేదిక ఇవ్వనున్న BRS నేతలు.

  • Jan 26, 2026 15:36 IST

    నిజామాబాద్ ఘటన అత్యంత దురదృష్టకరం: మంత్రి దామోదర

    • నిజామాబాద్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యపై గంజాయి స్మగ్లర్ల దాడి దారుణం..

    • కారకులైన ప్రతి ఒక్కరినీ చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహ

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 15:31 IST

    చైనా అణు రహస్యాలు.. అమెరికాకు లీక్ అయ్యాయా..

    • చైనా అణు రహస్యాలను అమెరికాకు లీక్ చేశారంటూ ప్రచారం..

    • ఆయుధ పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం..

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 15:28 IST

    శశిథరూర్‌‌కు సీపీఎం గాలం..!

    • ఎంపీ శశిథూరూర్‌తో అధికార వామపక్ష కూటమి చర్చలు జరిపిందనే ప్రచారం..

    • విదేశాల్లో ఉన్నప్పుడు ఇలాంటి వార్తలపై మాట్లాడటం సరికాదన్న శశిథరూర్..

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 15:21 IST

    ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురి మృతి..

    • కర్ణాటక తుమకూరు జిల్లా నేలహాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

    • ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురి మృతి..

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 15:17 IST

    టీడీపీ సంస్థాగత నిర్మాణంపై హైకమాండ్ స్పెషల్ ఫోకస్..

    • టీడీపీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే దిశగా హైకమాండ్ చర్యలు..

    • రేపు 25 పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ వర్క్ షాప్..

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 15:09 IST

    బస్సును ఢీకొట్టిన బైక్.. ఇద్దరి మృతి..

    • రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

    • కరీంనగర్ బైపాస్ రోడ్డులో స్కూల్ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టిన బైక్..

    • బైక్‌పై వెళ్తున్న వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామనికి చెందిన మ్యాకల గణేష్, సందీప్ రెడ్డి అక్కడికక్కడే మృతి.

  • Jan 26, 2026 14:57 IST

    భారత్‌తో ప్రపంచానికి భద్రత.. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలి వ్యాఖ్య

    • భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం అతిపెద్ద గౌరవం..

    • భారత దేశ విజయ ప్రస్థానంతో ప్రపంచానికి శాంతిసౌభాగ్యాలు: ఉర్సులా వాన్ డెర్ లాయెన్

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 14:32 IST

    ఛత్తీస్‌గఢ్ కర్రెగుట్టపై తొలిసారి గణతంత్ర వేడుకలు..

    • బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్ట కొండలపై తొలిసారి జాతీయ పతాకావిష్కరణ జరిగింది..

    • ఈ కొండలను నక్సలైట్లు తమ కంచుకోటగా చేసుకోవడంతో.. ఇప్పటివరకు జరగని వేడుకలు..

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 14:26 IST

    ఆ విషయంలో సంజూకు భరోసా ఇవ్వాలి: అజింక్య రహానే

    • టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌‌కు అజింక్య రహానే కీలక సూచన..

    • సంజూ ఒత్తిడికి గురవుతున్నాడు.. తన మీద తాను నమ్మకం కోల్పోకూడదు..

    • ఇషాన్ కిషన్ నుంచి సంజూకు తీవ్రమైన పోటీ ఎదురవుతోంది: అజింక్య రహానే

    పూర్తి కథనం..

  • Jan 26, 2026 13:52 IST

    శుభాన్షు శుక్లాకు పురస్కారం

    • ఢిల్లీ: గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాకు అత్యున్నత శౌర్య పురస్కారం

    • శుభాన్షు శుక్లాను అశోక చక్రతో గౌరవించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • న్యూఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో అవార్డు ప్రదానం

    పూర్తి కథనం

  • Jan 26, 2026 12:11 IST

    ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం

    • ఢిల్లీ: కర్తవ్యపథ్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం

    • పూలవర్షం కురిపించిన 4 MI-17 హెలికాప్టర్లు

    • పరేడ్‌లో పాల్గొన్న ఐరోపా సమాఖ్యకు చెందిన సైనిక బృందం

    • విన్యాసాల్లో 16 యుద్ధ విమానాలు, 9 హెలికాప్టర్లు, కార్గో విమానాలు

    • విన్యాసాల్లో రఫెల్, సుఖోయ్, మిగ్-29, జాగ్వార్ విమానాలు

    • ఆపరేషన్ సిందూర్ ఆయుధ వ్యవస్థను ప్రదర్శించిన త్రివిధ దళాలు

    • వివిధ విభాగాలకు చెందిన 30 శకటాల ప్రదర్శన

  • Jan 26, 2026 12:10 IST

    ఢిల్లీ: జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము

    • కర్తవ్యపథ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము

    • హాజరైన ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు

    • హాజరైన విదేశీ అతిథులు, 10 వేల మంది ప్రత్యేక ఆహ్వానితులు

    • కర్తవ్యపథ్‌లో వందేమాతరం థీమ్‌తో వేడుకలు

    • 6,050 మంది సైనికులతో పరేడ్

    • 17 రాష్ట్రాలు, 13 కేంద్ర ప్రభుత్వ శకటాలు

    పూర్తి కథనం

  • Jan 26, 2026 12:08 IST

    మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొంద పెట్టాలి: కేటీఆర్

    • చేవెళ్లలో కాలే యాదయ్యను కేసీఆర్ మనిషి అనుకుని గెలిపించారు: కేటీఆర్

    • కాలె యాదయ్య పార్టీ మారినట్టు ఆధారాలున్నాయి: కేటీఆర్

    • ఫిరాయింపుల అంశంలో స్పీకర్ పట్టనట్టు ఉంటున్నారు: కేటీఆర్

    • ప్రభుత్వాన్ని హామీలపై నిలదీస్తే మాపై కేసులు పెడుతున్నారు: కేటీఆర్

  • Jan 26, 2026 12:07 IST

    కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉంది: ABNతో కోదండరాం

    • మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై కాంగ్రెస్‌కు మా అభిప్రాయం తెలిపాం: కోదండరాం

    • సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది: కోదండరాం

    • సింగరేణిని కార్పొరేట్ శక్తుల చేతిలో బందీని చేయొద్దు: కోదండరాం

    • నేనూ కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే: ABNతో TJS చీఫ్‌ కోదండరాం

    • ట్యాపింగ్ చేసినప్పుడు లేని భయం.. విచారణకు ఎందుకు?: కోదండరాం

  • Jan 26, 2026 11:50 IST

    సిద్దిపేట: దుబ్బాకలో కాంగ్రెస్, BRS శ్రేణల మధ్య తోపులాట

    • దుబ్బాక అభివృద్ధికి ప్రభుత్వం సహకరించడంలేదని MLA కొత్త ప్రభాకర్‌ ఆరోపణ

    • రిపబ్లిక్ డే వేడుకల్లో రాజకీయాలు ఏంటని కాంగ్రెస్ శ్రేణుల నిలదీత

    • కాంగ్రెస్, BRS శ్రేణుల మధ్య పోటాపోటీ నినాదాలు, తోపులాట

    • పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు

  • Jan 26, 2026 10:16 IST

    ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి.. సంస్థలు తిరిగి బలపడుతున్నాయి: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

    • స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నాం: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

    • 2047నాటికి ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం: నజీర్

    • కాలానుగుణంగా పాలన మారాలి అనేది ఏపీ ప్రభుత్వ సిద్ధాంతం: గవర్నర్ నజీర్

    • సాంకేతికతతో క్షణాల్లో పాలన చేరేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం: ఏపీ గవర్నర్

    • సుపరిపాలనకు 10 సూత్రాలు నిర్దేశించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

    • పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకెళ్తున్నాం: జస్టిస్ అబ్దుల్ నజీర్

    పూర్తి కథనం

  • Jan 26, 2026 10:16 IST

    తొలిసారి రాజధాని అమరావతిలో జాతీయ జెండా ఎగురవేస్తున్నాం: గవర్నర్

    • గత కొన్నేళ్లుగా ఏపీ స్పష్టమైన దిశ లేకుండా నిలిచిపోయింది: గవర్నర్

    • రాజధాని నిర్మాణం ఆగిపోయింది.. ఆర్థిక విశ్వాసం దెబ్బతింది: గవర్నర్

    • ఆంధ్రప్రదేశ్ ప్రజలే-ప్రగతికి నిజమైన శిల్పులు: గవర్నర్ జస్టిస్ నజీర్

    • ఏపీ ప్రజల విశ్వాసం మళ్లీ స్థాపితమవుతోంది: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

  • Jan 26, 2026 10:15 IST

    సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు

    • అమర జవాన్లకు నివాళులర్పించిన గవర్నర్, డిప్యూటీ సీఎం

    • జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

    • పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, సీఎస్, డీజీపీ

    • పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్

    పూర్తి కథనం

  • Jan 26, 2026 08:32 IST

    భారత్‌లో గత వారం భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

    • వరుసగా రూ.15 వేలు, రూ.40 వేలు పెరిగిన బంగారం, వెండి

    • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానంతో పెరిగిన ధరలు

    • ఈవారం కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా

    పూర్తి కథనం

  • Jan 26, 2026 08:24 IST

    గణతంత్ర దినోత్సవం వేళ రాజస్థాన్‌‌లో కలకలం

    • నాగౌర్ జిల్లాలో భారీగా దొరికిన పేలుడు పదార్థాలు

    • ఓ పంట పొలంలో దాచిపెట్టిన డిటోనేటర్లను గుర్తించిన పోలీసులు

    • 187 బస్తాల్లో ప్యాక్ చేసిన 10 వేల కిలోల అమ్మోనియం నైట్రేట్‌ స్వాధీనం

    • ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా దాడులు

    పూర్తి కథనం

  • Jan 26, 2026 07:31 IST

    నేడు దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

    • ముఖ్య అతిథిగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంగోనియో కోస్టా

    • ముఖ్య అతిథిగా ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయెన్‌

    • గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు

    పూర్తి కథనం

  • Jan 26, 2026 07:29 IST

    రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు

    • రాయపూడి సమీపంలోని 22 ఎకరాల విస్తీర్ణంలో వేడుకలు

    • 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న గవర్నర్‌ నజీర్‌

    • హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, అధికారులు

  • Jan 26, 2026 07:28 IST

    చెరువులో చిక్కుకున్న కార్మికులు

    • హైదరాబాద్: మిరాలం చెరువులో చిక్కుకున్న 9 మంది కార్మికులు

    • మిరాలం చెరువులో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం

    • బ్రిడ్జి నిర్మాణానికి కొలతల కోసం వెళ్లిన పలువురు కార్మికులు

    • మిరాలం చెరువు మధ్యలో నిలిచిపోయిన కార్మికుల బోటు

    • 9 మంది కార్మికులను రక్షించిన DRF సిబ్బంది

  • Jan 26, 2026 07:28 IST

    అమెరికాను కప్పేసిన భారీ మంచు తుఫాన్

    • మంచు తుఫాన్ కారణంగా 10 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు

    • నేడు న్యూయార్క్, న్యూజెర్సీలకు వెళ్లే ఎయిరిండియా విమానాలు రద్దు

    • ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసిన ఎయిరిండియా