ఎయిర్‌పోర్టులో మహిళ కన్నీళ్లు.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు..
ABN , Publish Date - Jan 26 , 2026 | 08:26 PM
గన్నవరం ఎయిర్‌పోర్టులో మనసును హత్తుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ మహిళ కష్టం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చలించిపోయారు. ఆమె సమస్యను పరిష్కరించాలంటూ వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..
అమరావతి, జనవరి 26: గన్నవరం ఎయిర్‌పోర్టులో మనసును హత్తుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ మహిళ కష్టం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చలించిపోయారు. ఆమె సమస్యను పరిష్కరించాలంటూ వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దంపతులు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్‌ను చూసేందుకు కొంతమంది మహిళలు ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకున్నారు. అయితే ఎయిర్‌పోర్టులో వస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు.
మహిళలను పోలీసులు అడ్డుకోవడాన్ని గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సతీమణితో కలిసి వారి వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం పవన్ దంపతులు మహిళలతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కాకినాడకు చెందిన ప్రేమ కుమారి అనే మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వద్ద కన్నీరు పెట్టుకుంది. తన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని, తనకు సాయం చేయాలని కోరింది. పవన్ వెంటనే ప్రేమ కుమారి ఫిర్యాదును తీసుకోమని అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
ప్రతి 20 నిమిషాలకు ఒక భారతీయుడి అరెస్ట్.. అమెరికా బోర్డర్ దగ్గర ఏం జరుగుతోందంటే..
బీట్‌రూట్ హల్వా.. ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో మీకు తెలుసా?