ప్రతి 20 నిమిషాలకు ఒక భారతీయుడి అరెస్ట్.. అమెరికా బోర్డర్ దగ్గర ఏం జరుగుతోందంటే..
ABN , Publish Date - Jan 26 , 2026 | 07:59 PM
ఉద్యోగావకాశాలు, మెరుగైన జీవనం కోసం చాలా మంది అమెరికా వెళ్తుంటారు. వారిలో భారతీయులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. వారిలో కొందరు సక్రమంగా వీసాలు సంపాదించి అమెరికాలోకి ప్రవేశిస్తుంటే, మరికొందరు సరిహద్దు దేశాల నుంచి అక్రమంగా బోర్డర్ దాటుతుంటారు.
ఉద్యోగావకాశాలు, మెరుగైన జీవనం కోసం చాలా మంది అమెరికా వెళ్తుంటారు. వారిలో భారతీయులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. వారిలో కొందరు సక్రమంగా వీసాలు సంపాదించి అమెరికాలోకి ప్రవేశిస్తుంటే, మరికొందరు సరిహద్దు దేశాల నుంచి అక్రమంగా బోర్డర్ దాటుతుంటారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు (Indians caught at US border 2025).
అమెరికా సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో ప్రతి 20 నిమిషాలకు ఒక భారతీయుడు అరెస్ట్ అవుతున్నారట. సగటున రోజుకు 65 మంది భారతీయులను అమెరికా అధికారులు నిర్బంధిస్తున్నారట. 2025 జనవరి-డిసెంబర్ మధ్యలో 23,830 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్టు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం వెల్లడించింది. ఇలా అమెరికా సరిహద్దుల వద్ద పట్టుబడుతున్న వారిలో భారతీయులే అధికంగా ఉన్నారని అధికారులు తెలిపారు (US border arrests Indians).
అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడానికి మెక్సికో, కెనడా దేశాలను చాలా మంది ఉపయోగించుకుంటున్నారట (illegal migration Indians USA). దుబాయ్, ఇస్తాంబుల్ మీదుగా కెనడా లేదా మెక్సికో చేరుకుని అక్కడి నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారట. ప్రస్తుతం ఆ మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో చాలా మంది ఇతర ప్రమాదకర మార్గాలను ఎంచుకుంటున్నారట. ఇలా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న వారిలో ఏ తోడూ లేని పిల్లలు కూడా కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఇదెక్కడి ప్రేమ.. బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి డీఎన్‌ఏ టెస్ట్ చేయిస్తుందట..
వావ్, పాములకు ఈ ట్యాలెంట్ కూడా ఉందా.. నీటిలోని చేపను ఎలా పట్టుకుందో చూడండి..