Share News

కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే: ఎమ్మెల్సీ అద్దంకి

ABN , Publish Date - Jan 26 , 2026 | 04:48 PM

గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్పీకర్‌ను అవమానించిన మాజీ మంత్రి కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నాటకాలు ఆడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే: ఎమ్మెల్సీ అద్దంకి
Addanki Dayakar

హైదరాబాద్, జనవరి 26: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై(Former Minister KTR) కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(Congress MLC Addanki Dayakar) తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్పీకర్‌ను అవమానించినందుకు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘సభాపతిని ధృతరాష్ట్రుడితో పోల్చడం ఏమిటి? సభ్యుడిగా మీకు సంస్కారముందా? ముఖ్యమంత్రిని అవమానించడం మీది ఏ రాజనీతి? మీ నాయన కేసీఆర్ రాజ్యాంగంతో తెలంగాణ వచ్చిందని చెబుతూ అవమానిస్తున్నారు. రాజ్యాంగ వ్యతిరేకులుగా మారి, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నాటకాలు వేస్తున్నారు, నాటకాలు ఆడిస్తున్నారు’ అని ఎమ్మెల్సీ విమర్శించారు.


ఫస్ట్రేషన్‌తో నాటకాలు..

అద్దంకి ఇంకా మాట్లాడుతూ.. ‘మీరు, పది మంది గురించి మాట్లాడుతున్నారు.. కానీ 39 మందిని మీ పార్టీలో చేర్చుకున్న మిమ్మల్ని ఏమనాలి? మీరు చేసిన రాజ్యాంగ ద్రోహాన్ని ప్రజలు మననం చేసుకుంటున్నారు. ఫస్ట్రేషన్‌తో చేస్తున్న మీ నాటకాలను ప్రజలు తిరస్కరించారు. మీరు ప్రతిపక్ష నాయకులుగా ఉండటం దురదృష్టకరం. ఇప్పటికైనా మీరు చేసిన తప్పును గమనించి క్షమాపణ చెబితే మంచిది’ అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

ప్రజల విశ్వాసమే మా బలం.. వారి భద్రతకే తొలి ప్రాధాన్యం: సీపీ సజ్జనార్

నిజామాబాద్ ఘటన అత్యంత దురదృష్టకరం.. చట్టప్రకారం శిక్ష తప్పదు: మంత్రి దామోదర

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 26 , 2026 | 05:07 PM