Share News

బండ్ల గణేశ్‌ను ఫోన్‌లో పరామర్శించిన మంత్రి నారా లోకేశ్

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:40 PM

తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ కాలినొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు మంత్రి నారా లోకేశ్ ఫోన్ చేసి పరామర్శించారు.

బండ్ల గణేశ్‌ను ఫోన్‌లో పరామర్శించిన మంత్రి నారా లోకేశ్
Minister Nara Lokesh

అమరావతి, జనవరి 26: సినీ నిర్మాత బండ్ల గణేశ్(Producer Bandla Ganesh) తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో ఆయన కాలినొప్పితో బాధపడుతున్నారు. విషయం తెలిసిన ఏపీ మంత్రి నారా లోకేశ్‌(AP Minister Nara Lokesh).. బండ్ల గణేశ్‌ను ఫోన్‌లో పరామర్శించారు. పాదయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కాలినొప్పి నుంచి త్వరగా కోలుకుని, మొక్కు చెల్లించుకోవాలని ఆకాంక్షించారు.


గతంలో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అక్రమ కేసులో అరెస్టైన సమయంలో తాను తిరుమల వేంకన్నకు మొక్కుకున్నానని బండ్ల గణేశ్ చెప్పిన విషయం తెలిసిందే. జైలు నుంచి చంద్రబాబు విడుదలై ఎన్నికల్లో గెలిచి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఈ క్రమంలో బండ్ల గణేశ్ తన మొక్కును తీర్చుకునేందుకు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.


'సంకల్ప యాత్ర' పేరుతో బండ్ల గణేశ్ ఈ పాదయాత్రను చేపట్టారు. జనవరి 19న షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించారు. కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇది రాజకీయాలకు సంబంధం లేదని, కేవలం చంద్రబాబు పట్ల తన అభిమానం, భక్తి కారణంగానే చేస్తున్నానని బండ్ల స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

ప్రజల విశ్వాసమే మా బలం.. వారి భద్రతకే తొలి ప్రాధాన్యం: సీపీ సజ్జనార్

రాజ్యాంగ విలువలు కాపాడుదాం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం: మంత్రి దుర్గేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 26 , 2026 | 04:35 PM