Share News

మా వాళ్లతో జాగ్రత్త.. పాక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వార్నింగ్

ABN , Publish Date - Jan 26 , 2026 | 07:29 PM

టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. పాకిస్థాన్ టీ20 ప్రపంచ కప్ ఆడటానికి రాకపోవడమే మంచిదంటూ కామెంట్స్ చేశాడు.

మా వాళ్లతో జాగ్రత్త.. పాక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వార్నింగ్
Kris Srikkanth

స్పోర్ట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ 2026(T20 World Cup)లో పాకిస్థాన్‌ పాల్గొనడంపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఐసీసీ టోర్నీ కోసం జట్టును ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు.. తాము టోర్నీలో పాల్గొనేది, లేనిది.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ఈ అంశంపై తాజాగా.. టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్(Srikanth) స్పందించాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. పాకిస్థాన్ టీ20 ప్రపంచ కప్ ఆడటానికి రాకపోవడమే మేలంటూ ఫన్నీగా కామెంట్స్ చేశాడు.


కృష్ణమాచారి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. టీమిండియా బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 'న్యూజిలాండ్‌తో(New Zealand) రెండో టీ20లో భారత్ 15.2 ఓవర్లలోనే 209 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. అలానే మూడో మ్యాచ్‌లో10 ఓవర్లలోనే 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీన్ని చూసి చాలా జట్లు.. వద్దు.. మేం రావడం లేదు. ప్రపంచ కప్‌ను మీరే ఉంచుకోండి’ అని అనొచ్చేమో అని చెప్పుకొచ్చారు శ్రీకాంత్.


అలాగే పాకిస్థాన్ జట్టుకు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు కృష్ణమాచారి. 'పాక్ ఐసీసీ మెగా టోర్నీకి రాకపోవడమే మంచిది. పాక్ వరల్డ్ కప్‌లో పాల్గొంటే వారికి భారత బ్యాటర్లు చుక్కలు చూపిస్తారు. మా వాళ్లు కొలంబోలో సిక్స్ కొడితే బంతి మద్రాస్‌లో పడుతుంది.. జాగ్రత్త.! మీరు టీ20 ప్రపంచకప్‌లో పాక్ ఆడకపోవడమే ఉత్తమం. టోర్నీ నుంచి వైదొలగడానికి మీరు కూడా బంగ్లాదేశ్ మాదిరిగా ఏదో ఒక సాకు వెతుక్కోండి. భారత జట్టు అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటోంది. టీ20 క్రికెట్‌లో ఇలాంటి హిట్టింగ్‌ను నేనెప్పుడూ చూడలేదు’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ ఫాలో అయితే బావుంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

నా రికార్డును బ్రేక్ చేయలేకపోయావ్.. అభిషేక్ శర్మను ఆటపట్టించిన యువీ

టీమిండియాకు గుడ్‌ న్యూస్.. ప్రపంచ కప్ నాటికి స్టార్ ప్లేయర్‌కు పూర్తి ఫిట్‌నెస్!

Updated Date - Jan 26 , 2026 | 07:43 PM