Share News

టీమిండియాకు గుడ్‌ న్యూస్.. ప్రపంచ కప్ నాటికి స్టార్ ప్లేయర్‌కు పూర్తి ఫిట్‌నెస్!

ABN , Publish Date - Jan 26 , 2026 | 11:57 AM

టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. అనూహ్యంగా సర్జరీ వల్ల జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో చివరి టీ20 నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడనే వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026కు తిలక్ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.

టీమిండియాకు గుడ్‌ న్యూస్.. ప్రపంచ కప్ నాటికి స్టార్ ప్లేయర్‌కు పూర్తి ఫిట్‌నెస్!
Team India

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. అనూహ్యంగా సర్జరీ వల్ల జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో చివరి టీ20 నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడనే వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026కు తిలక్ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. అయితే టీమిండియా యాజమాన్యం అతడిని న్యూజిలాండ్‌తో చివరి టీ20లో ఆడించడం కంటే.. నేరుగా ప్రపంచ కప్‌లోనే ఆడించడానికి ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం తిలక్ వర్మ(Tilak Varma) బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.


ఈ నేపథ్యంలో వరుసగా మూడు టీ20ల్లో విఫలమైన సంజు శాంసన్‌కు మరో అవకాశం దక్కనుంది. ప్రస్తుతం సంజూ.. ఇషాన్ కిషన్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నాడు. అయితే ఆసియా కప్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన.. అతడి ఫామ్ పరిగణనలోకి తీసుకుంటే తిలక్ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. అయితే తిలక్ వర్మ తిరిగి జట్టులోకి చేరితే సంజూ శాంసన్‌పై వేటు పడక తప్పదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


మరోవైపు వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో పక్కటెముకల గాయానికి గురైన వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar) రెండు వన్డేలు, టీ20 సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. అతడికి మరో రెండు వారాల విశ్రాంతి అవసరమని బీసీసీఐ వర్గాల సమాచారం. అయితే టీ20 వరల్డ్ కప్‌ జట్టులోకి వాషీని తీసుకుంటారా? లేదా రీప్లేస్‌మెంట్‌కు వెళతారా? అనే విషయమై సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీ20 వరల్డ్‌ కప్‌ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

టీమిండియాను చూసి ప్రత్యర్థి జట్లు భయపడాల్సిందే: సునీల్ గావస్కర్

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా కన్నుమూత

Updated Date - Jan 26 , 2026 | 12:47 PM