Share News

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా కన్నుమూత

ABN , Publish Date - Jan 26 , 2026 | 10:06 AM

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ బింద్రా ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన 1993 నుంచి 1996 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అలాగే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు 1978 నుంచి 2014 వరకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా కన్నుమూత
IS Bindra

ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ బింద్రా(84) ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన 1993 నుంచి 1996 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అలాగే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు 1978 నుంచి 2014 వరకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2015లో పీసీఏ స్టేడియానికి ఐఎస్ బింద్రా పేరు పెట్టారు. గతంలో బింద్రా(IS Bindra) ఐసీసీ ప్రధాన సలహాదారుగా కూడా పని చేశారు.


1987 ప్రపంచ కప్‌ను భారత్‌లో నిర్వహించడంలో బింద్రా ప్రముఖ పాత్ర పోషించారు. 1975, 1979, 1983 ఎడిషన్‌ల తర్వాత ప్రపంచ ఈవెంట్‌ను ఇంగ్లండ్ బయట నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. క్రికెట్ ప్రసారంలో దూరదర్శన్ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన 1994లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం నుంచి వచ్చిన అనుకూల తీర్పు బింద్రా, అతడి బృందం..ఈఎస్‌పీఎన్‌ (ESPN), టీడబ్ల్యూఐ (TWI) వంటి ప్రపంచ సంస్థలను భారత మార్కెట్‌కు తీసుకురావడానికి సహాయపడింది. క్రికెట్ దక్షిణాఫ్రికా సీఈఓగా హరూన్ లోర్గాట్ నియామకంలో బింద్రా కీలక పాత్ర పోషించారు. ఆయన క్రికెట్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి 2014లో రిటైరయ్యారు.


జై షా సంతాపం..

ఐఎస్ బింద్రా మృతికి ఐసీసీ(ICC) ఛైర్మన్ జై షా సంతాపం తెలిపారు. ‘బీసీసీఐ(BCCI) మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా మృతికి ప్రగాఢ సంతాపం. ఆయన వారసత్వం భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలి. ఓం శాంతి’ అని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. బీసీసీఐ కూడా సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించింది.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్

సంజూ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నాడు: టీమిండియా మాజీ క్రికెటర్

Updated Date - Jan 26 , 2026 | 10:07 AM