Share News

న్యూజిలాండ్‌తో మూడో టీ20.. భారత్ ఘన విజయం

ABN , Publish Date - Jan 25 , 2026 | 09:55 PM

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 2 వికెట్లు కోల్పోయి 10 ఓవర్లలోనే ఛేదించింది.

న్యూజిలాండ్‌తో మూడో టీ20.. భారత్ ఘన విజయం
India

ఇంటర్నెట్ డెస్క్: గువాహటి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 2 వికెట్లు కోల్పోయి 10 ఓవర్లలోనే ఛేదించింది. ఈ ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-0తో ఇంకా రెండు మ్యాచులు ఉండగానే చేజెక్కించుకుంది. అభిషేక్ శర్మ(68*), సూర్య కుమార్ యాదవ్(57*) అర్థ శతకాలతో విధ్వంసం సృష్టించారు. భారత బ్యాటర్ల షాట్లకు కివీస్ బౌలర్ల దగ్గర సమాధానమే లేకపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది.


గ్లెన్ ఫిలిప్స్(48), చాప్‌మన్(32), శాంట్నర్(27) మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3, హార్దిక్ పాండ్య, రవి బిష్ణోయ్ తలో 2, హర్షిత్ రాణా ఒక వికెట్ పడగొట్టారు. 154 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదనకు దిగిన టీమిండియా.. 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజూ శాంసన్(0) మరోసారి నిరాశపర్చాడు. ఇషాన్ కిషన్(28) క్రీజులో ఉన్నంత సేపు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అర్థ శతకాలతో రాణించి కివీస్ బౌలర్లకు చెమటలు పట్టించారు. కివీస్ బౌలర్లలో హెన్రీ, సోధీ చెరొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్

సంజూ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నాడు: టీమిండియా మాజీ క్రికెటర్

Updated Date - Jan 25 , 2026 | 09:56 PM