Share News

రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్‌లకు ‘పద్మశ్రీ’

ABN , Publish Date - Jan 25 , 2026 | 06:48 PM

గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. క్రీడా విభాగంలో పలువురికి పద్మ అవార్డులు వరించాయి. హాకీ, క్రికెట్, ఫుట్‌బాల్, పారా -ఆర్చరీ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన దిగ్గజ క్రీడాకారులను ఈ గౌరవం వరించింది.

రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్‌లకు ‘పద్మశ్రీ’
Padma Shri

ఇంటర్నెట్ డెస్క్: గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations) వేళ కేంద్రప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. క్రీడా విభాగంలో పలువురికి పద్మ అవార్డులు వరించాయి. హాకీ, క్రికెట్, ఫుట్‌బాల్, పారా -ఆర్చరీ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన దిగ్గజ క్రీడాకారులను ఈ గౌరవం వరించింది. భారత అత్యున్నత పౌర పురస్కారాల జాబితాలో ఈ సారి క్రీడాకారులకు పెద్దపీట వేశారు.


భారత మాజీ హాకీ గోల్‌కీపర్‌, కెప్టెన్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ను పద్మ అవార్డుల్లో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌ వరించింది. శ్రీజేశ్ పారిస్ ఒలింపిక్స్‌లో ఎన్నో అద్భుత సేవ్‌లతో భారత జట్టు వరుసగా రెండోసారి కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. దశాబ్దానికిపైగా భారత క్రికెట్‌కు సేవలందించిన రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆయన చేసిన సేవలకుగాను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేశారు. టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో కొనసాగిస్తూ అద్భుతమైన ప్రదర్శనలు చేస్తోన్న స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు పద్మ శ్రీ వరించింది. భారత ఆల్‌టైమ్‌ ఫుట్‌బాల్ ప్లేయర్లలో ఒకరైన మణి విజయన్ కూడా పద్మశ్రీ వరించింది. 2024 పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన హర్విందర్‌ సింగ్ కూడా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యాడు. పారాలింపిక్స్‌లో పసిడి నెగ్గిన తొలి భారత ఆర్చర్‌ హర్విందర్‌ కావడం విశేషం.


క్రీడా విభాగంలో పద్మ అవార్డులు దక్కింది వీరికే

  • పీఆర్ శ్రీజేష్-కేరళ (హాకీ) పద్మభూషణ్

  • హర్విందర్ సింగ్-హరియాణా (పారా ఆర్చర్) పద్మశ్రీ

  • రోహిత్ శర్మ-మహారాష్ట్ర(క్రికెట్)-పద్మశ్రీ

  • హర్మన్ ప్రీత్ కౌర్- పంజాబ్(క్రికెట్)- పద్మశ్రీ

  • రవిచంద్రన్ అశ్విన్-తమిళనాడు (క్రికెట్) పద్మశ్రీ

  • మణి విజయన్-కేరళ (ఫుట్‌బాల్) పద్మశ్రీ

  • సత్యపాల్ సింగ్- ఉత్తరప్రదేశ్ (పారా అథ్లెట్ కోచ్‌) పద్మశ్రీ


ఇవి కూడా చదవండి:

ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్

సంజూ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నాడు: టీమిండియా మాజీ క్రికెటర్

Updated Date - Jan 25 , 2026 | 06:48 PM