బిగ్ బాష్ లీగ్.. ఛాంపియన్‌గా నిలిచిన పెర్త్ స్కార్చర్స్
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:38 PM
బిగ్ బాష్ లీగ్ 2025-2026 సీజన్ ఛాంపియన్‌గా పెర్త్ స్కార్చర్స్ అవతరించిది. సిడ్నీ సిక్సర్‌తో జరిగిన ఫైనల్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే పెర్త్ స్కార్చర్స్‌కు బీబీఎల్‌లో ఇది ఆరో టైటిల్ కావడం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: బిగ్ బాష్ లీగ్ 2025-2026 సీజన్ ఛాంపియన్‌గా పెర్త్ స్కార్చర్స్ అవతరించిది. సిడ్నీ సిక్సర్‌తో జరిగిన ఫైనల్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే పెర్త్ స్కార్చర్స్‌కు బీబీఎల్‌లో ఇది ఆరో టైటిల్ కావడం విశేషం. టోర్నమెంట్‌లో మరే జట్టే ఇన్నిసార్లు ఛాంపియన్‌గా నిలవలేదు.
ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్ సరిగ్గా 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. జోష్ ఫిలిప్ (24), స్టీవ్ స్మిత్ (24), మోయిసెస్ హెన్రిక్స్ (24), జోయెల్ డేవిస్ (19), లచ్లాన్ షా (14) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పెర్త్ బౌలర్లలో డేవిడ్ పేన్ (3/18), జే రిచర్డ్‌సన్ (3/32) రాణించారు. 133 పరుగుల టార్గెట్‌ని పెర్త్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిచెల్ మార్ష్ (44; 43 బంతుల్లో), ఫిన్ అలెన్ (36; 22 బంతుల్లో) శుభారంభం అందించడంతో పెర్త్ విజయం ఖాయమైపోయింది. జోష్ ఇంగ్లిస్ (29*; 26 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. కాగా మూడు వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన డేవిడ్ పేన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్
సంజూ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నాడు: టీమిండియా మాజీ క్రికెటర్