క్వార్టర్స్‌లో అల్కారజ్, సబలెంక
ABN , Publish Date - Jan 26 , 2026 | 05:55 AM
టాప్‌సీడ్లు కార్లోస్ అల్కారజ్, అర్యానా సబలెంక ఆస్ర్టేలియన్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లారు. మరోవైపు ప్రత్యర్థి వాకోవర్ ఇవ్వడంతో దిగ్గజ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఆడకుండానే...
మెద్వెదెవ్, ఆండ్రీవా అవుట్
ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్‌బోర్న్: టాప్‌సీడ్లు కార్లోస్ అల్కారజ్, అర్యానా సబలెంక ఆస్ర్టేలియన్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లారు. మరోవైపు ప్రత్యర్థి వాకోవర్ ఇవ్వడంతో దిగ్గజ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఆడకుండానే ముందంజ వేశాడు. అల్కారజ్ 7-6 (6), 6-4, 7-5తో టామీ పాల్‌పై, మూడో సీడ్ జ్వెరెవ్ 6-2, 6-4, 6-4తో సెరెండులోపై, ఆరోసీడ్ డిమినార్ 6-4, 6-1, 6-1తో బబ్లిక్‌పై, టీన్ 6-4, 6-0, 6-3తో 11వ సీడ్ మెద్వెదెవ్‌పై విజయంతో రౌండ్-8కు చేరారు. ఇక సోమవారంనాటి నాలుగో రౌండ్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్వాలిఫయర్ జాకబ్ మెన్సిక్‌తో జొకో తలపడాల్సి ఉంది. కానీ పొత్తి కడుపు గాయంతో జాకబ్ వైదొలగడంతో నొవాక్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరాడు. మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్‌ఫైనల్లో టాప్ సీడ్ సబలెంక 6-1, 7-6 (1)తో 17వ సీడ్ ఎంబొకోపై, మూడో సీడ్ కొకొ గాఫ్ 6-1, 3-6, 6-3తో 19వ సీడ్ ముచోవాపై, 12వ సీడ్ స్విటోలినా 6-2, 6-4తో ఎనిమిదో సీడ్ ఆండ్రీవాపై నెగ్గారు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్
సంజూ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నాడు: టీమిండియా మాజీ క్రికెటర్