గోల్డ్, సిల్వర్ రేట్స్! ఈ వారం కూడా దూకుడు తప్పదా..
ABN , Publish Date - Jan 26 , 2026 | 07:02 AM
గత వారం రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు ఈ వారం కూడా అదే దూకుడు కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం, వెండి ధరలు గత వారం భారీ స్థాయిలో పెరిగాయి. మేలిమి బంగారం సుమారు రూ.15 వేల మేర పెరిగింది. వెండి ధరలు సుమారు రూ.40 వేల పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానంతో పెరుగుతున్న భౌగోళిక అనిశ్చితులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు వెరసి బంగారం, వెండి ధరలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ వారం కూడా ధరల్లో పెరుగుదల తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి (Gold, Silver Rates on Jan 26).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,250కు చేరుకుంది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,46,890గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.3,64,900 వద్ద తచ్చాడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్స్ కొనసాగుతున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం మేలిమి బంగారం ధర తొలిసారిగా 5 వేల డాలర్ల మార్కును దాటింది. ఔన్స్ (31.10 గ్రాముల) బంగారం ధర ప్రస్తుతం 5065 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా ఔన్స్ వెండి ధర కూడా రికార్డు స్థాయిలో 107 డాలర్లకు ఎగబాకింది. డాలర్ బలహీనత, మార్కెట్ అనిశ్చితులు వెరసి ఈ వారం కూడా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
రూపాయి పతనంపై దిగుమతిదారుల బెంబేలు