రూపాయి పతనంపై దిగుమతిదారుల బెంబేలు
ABN , Publish Date - Jan 26 , 2026 | 05:02 AM
డాలర్‌తో రూపాయి పతనం ఆర్థికవేత్తలతో పాటు ప్రభుత్వాన్నీ కలవర పరుస్తోంది. శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం రేటు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.92 స్థాయికి పడిపోయింది.
న్యూఢిల్లీ: డాలర్‌తో రూపాయి పతనం ఆర్థికవేత్తలతో పాటు ప్రభుత్వాన్నీ కలవర పరుస్తోంది. శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం రేటు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.92 స్థాయికి పడిపోయింది. దీంతో మన దేశానికి ప్రధాన దిగుమతులపైన ముడి చమురు, బంగారం, వెండి, వంటనూనెలు, రసాయన ఎరువులు, ఎలకా్ట్రనిక్ వస్తువుల దిగుమతులు మరింత భారం కానున్నాయి. విదేశీ విద్య, విదేశీ ప్రయాణాలపైనా మరింత ఖర్చు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీస్తుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎగుమతిదారులకు లాభం: డాలర్‌తో రూపాయి పతనంపై దిగుమతిదారులు లబోదిబో మంటుంటే, ఎగుమతి కంపెనీలు మాత్రం ఖుషీ ఖుషీగా ఉన్నాయి. దీంతో తాము అందుకునే డాలర్లకు మరిన్ని రూపాయలు సొమ్ము చేసుకోవచ్చని భావిస్తున్నాయి. అయితే ప్రధాన ముడి పదార్ధాల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడిన ఎగుమతిదారులకు మాత్రం ఈ విషయంలో పెద్దగా లాభం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ట్రంప్ సుంకాలతో చతికిల పడిన వస్త్ర, ఆభరణ, మత్స్య ఎగుమతులకూ కూడా రూపాయి పతనం పెద్దగా లాభించక పోవచ్చని అంచనా. అయితే ఐటీ కంపెనీలకు మాత్రం ఇది బాగానే కలిసి వస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.