Share News

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు స్పాట్ డెడ్

ABN , Publish Date - Jan 26 , 2026 | 02:06 PM

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు స్పాట్ డెడ్
Karnataka Road Accident,

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక(Karnataka)లోని తుమకూరు జిల్లా నేలహాల్ సమీపంలోని జాతీయ రహదారి(National Highway-48)పై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరుకు చెందిన ఆరుగురు వ్యక్తులు.. మారుతి ఎర్టిగా కారు(Maruti Suzuki Ertiga)లో బయల్దేరారు. గోకర్ణ, మురుడేశ్వర్, ఉడిపి వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించి తిరిగి వస్తుండగా.. నేలహాల్ సమీపంలో రొడ్డుపక్కన నిలిపి ఉంచిన ఓ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే తుమకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.


సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీరంతా బెంగళూరులోని సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. గణతంత్ర దినోత్సవ వేళ యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండుకుంది.


ఇవి కూడా చదవండి..

త్వరలోనే మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్.. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి గణతంత్ర ప్రసంగం

ఇది ఎన్నికల పోరు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం.. విజయ్

Read Latest National News

Updated Date - Jan 26 , 2026 | 03:10 PM