Share News

హార్వర్డ్ కెనెడీ స్కూల్లో సీఎం రేవంత్‌రెడ్డి కొత్త అధ్యాయం..

ABN , Publish Date - Jan 26 , 2026 | 08:52 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ కెనెడీ స్కూల్‌లో తన ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను ఉత్సాహంగా ప్రారంభించారు. రాష్ట్ర పాలనలో ఆధునిక దృక్పథాన్ని అలవర్చుకునే దిశగా ఆయన ఈ శిక్షణలో పాల్గొన్నారు..

హార్వర్డ్ కెనెడీ స్కూల్లో సీఎం రేవంత్‌రెడ్డి కొత్త అధ్యాయం..
CM Revanth Reddy

ఇంటర్నెట్‌డెస్క్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అమెరికా పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ కెనెడీ స్కూల్‌లో తన ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను ఉత్సాహంగా ప్రారంభించారు. రాష్ట్ర పాలనలో ఆధునిక దృక్పథాన్ని అలవర్చుకునే దిశగా ఆయన ఈ శిక్షణలో పాల్గొన్నారు. ‘Leadership in the 21st Century’ కోర్సులో సీఎం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ‘Analysing Authority and Leadership’ సెషన్‌తో తరగతులు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచే తరగతులు ప్రారంభమై, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతున్నాయి.


ఇందులో కేస్ స్టడీస్, గ్రూప్ డిస్కషన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. బోస్టన్ నగరంలో ప్రస్తుతం వాతావరణం అత్యంత కఠినంగా ఉంది. ‘ఫెర్న్’ (Fern) మంచు తుఫాను కారణంగా అక్కడ వింటర్ ఎమర్జెన్సీ విధించారు. సుమారు 2 అడుగులకు పైగా మంచు పేరుకుపోయింది. ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఇంతటి గడ్డకట్టే చలిని కూడా లెక్కచేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి తన తరగతులకు హాజరవుతుండటం గమనార్హం.


ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల ప్రముఖులతో కలిసి సీఎం ఈ నాయకత్వ మెలకువలను నేర్చుకుంటున్నారు. ఈ శిక్షణ ద్వారా పొందిన విజ్ఞానం భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధికి, పాలనా పరమైన సంస్కరణలకు దోహదపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా విద్యార్థిగా మారి హార్వర్డ్ వంటి సంస్థలో శిక్షణ పొందడం రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన

ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 26 , 2026 | 09:58 PM