నేను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే: కోదండరాం
ABN , Publish Date - Jan 26 , 2026 | 08:36 PM
ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినేనని తెలిపారు..
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసుపై (Phone Tapping Case) తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినేనని తెలిపారు. ట్యాపింగ్ చేసినప్పుడు లేని భయం.. విచారణకు ఎందుకు? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై కాంగ్రెస్‌కు తమ అభిప్రాయం తెలిపామని పేర్కొన్నారు. సోమవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో కోదండరాం మాట్లాడారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పుకొచ్చారు. సింగరేణిని కార్పొరేట్ శక్తుల చేతిలో బందీ చేయొద్దని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని కోదండరాం తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన
ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Read Latest Telangana News And Telugu News