ఆ విషయంలో సంజుకి టీమ్ మేనేజ్‌మెంట్ భరోసా ఇవ్వాలి: అజింక్య రహానే
ABN , Publish Date - Jan 26 , 2026 | 01:54 PM
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మూడు టీ20ల్లో 10, 6, 0 పరుగులతో సంజు తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే అతడికి పలు కీలక సూచనలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మూడు టీ20ల్లో 10, 6, 0 పరుగులతో సంజు తీవ్రంగా నిరాశపర్చాడు. ముఖ్యంగా గువాహటి మ్యాచులో డకౌటయ్యాడు. పేలవ ఫామ్‌తో టీ20 జట్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్ స్థానంలో సంజు శాంసన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే సంజు కూడా పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే(Ajinkya Rahane) అతడికి పలు కీలక సూచనలు చేశాడు.
‘సంజు శాంసన్(Sanju Samson)కు టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్, కోచ్ వెన్నుదన్నుగా నిలవాలి. ప్రపంచ కప్‌లో నువ్వు ఆడబోతున్నావ్ అని అతడికి ధైర్యమివ్వాలి. జట్టులో స్థానం గురించి ఆందోళన అవసరం లేదని భరోసా ఇవ్వాలి. మరో ఎండ్‌లో అభిషేక్ శర్మ లాంటి బ్యాటర్ వేగంగా పరుగులు చేస్తుంటే.. తానూ అలాగే రన్స్ సాధించాలని సంజు ఒత్తిడికి గురవుతున్నాడు. సంజు తన మీద తాను నమ్మకం కోల్పోకూడదు. తన సొంత ఆట తాను ఆడాలి’ అని రహానే సూచించాడు.
మరోవైపు ఇషాన్ కిషన్(Ishan Kishan) నుంచి సంజుకి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. దేశవాళీల్లో అదరగొట్టి జాతీయ జట్టులోకి వచ్చిన ఇషాన్.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఇషాన్.. తిలక్ వర్మ స్థానంలో వన్ డౌన్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్నాడు. అతడు ఇప్పటి వరకు న్యూజిలాండ్‌తో మూడు టీ20ల్లో వరుసగా 8, 76, 28 పరుగులు చేశాడు.
ఇవి కూడా చదవండి:
నా రికార్డును బ్రేక్ చేయలేకపోయావ్.. అభిషేక్ శర్మను ఆటపట్టించిన యువీ
టీమిండియాకు గుడ్ న్యూస్.. ప్రపంచ కప్ నాటికి స్టార్ ప్లేయర్‌కు పూర్తి ఫిట్‌నెస్!