ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్.. (18/01/2026)
ABN , First Publish Date - Jan 18 , 2026 | 07:30 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Updates
-
Jan 18, 2026 09:14 IST
నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న అభిమానులు, ప్రముఖులు
ఎక్స్ వేదికగా నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించిన హీరో కళ్యాణ్ రామ్, మంత్రి లోకేశ్
-
Jan 18, 2026 09:02 IST
తెలంగాణ రైతన్నలకు గుడ్ న్యూస్..
అన్నదాతలకు భారీ ఊరటనిస్తూ టీజీఈఆర్‌సీ ఉత్తర్వులు
ఇకపై రైతులు కిలోవాట్‌కు రూ.వెయ్యి చొప్పున ఛార్జీలు
-
Jan 18, 2026 08:17 IST
మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య హిందువులకు ప్రత్యేకం
నేడు మౌని అమావాస్య సందర్భంగా ఏడు సాగర సంగమాల వద్ద స్నానం ఆచరించనున్న భక్తులు
గోదావరిలో స్నానం చేయడం వల్ల చేసిన పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం
నేడు దానధర్మాలు కూడా ఎంతో మంచిదని హిందూ సోదరుల విశ్వాసం
-
Jan 18, 2026 07:34 IST
నిరక్షరాస్యత, పేదరికం, కరువే నా శత్రువులు: సీఎం రేవంత్ రెడ్డి
ఉన్న ఒక్క శత్రువునూ ఎన్నికల్లో ఓడించాను: సీఎం రేవంత్
మారీచుడు ఏ రూపంలో వచ్చినా కట్టిపడేస్తాం: సీఎం రేవంత్
జైపాల్‌రెడ్డి, జానారెడ్డి సమయంలో చెల్లినట్లు ఇప్పుడు చెల్లదు.. దెబ్బకు దెబ్బ తీస్తాం: సీఎం రేవంత్
-
Jan 18, 2026 07:32 IST
యూనిట్ విద్యుత్ కొనుగోలు ఖర్చు రూ.1.19కి తగ్గిస్తాం: సీఎం చంద్రబాబు
ఈ ఏడాదే డ్రోన్ అంబులెన్స్ సేవలు అందుబాటులోకి: సీఎం చంద్రబాబు
సంపద సృష్టికి ఏపీని మించిన రాష్ట్రం లేదు: సీఎం చంద్రబాబు
కాకినాడలో ‘గ్రీన్ అమ్మోనియా’ ప్లాంట్ ప్రారంభించిన చంద్రబాబు, పవన్
-
Jan 18, 2026 07:30 IST
పెరుగుతున్న గోల్డ్, సిల్వర్ రేట్లు..
భారత్‌లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు
రోజురోజుకూ పెరిగిపోతున్న గోల్డ్, సిల్వర్ ధరలు
జనవరిలో ఇప్పటివరకూ 7శాతం మేర పెరిగిన పసిడి ధర