Share News

RSS Mohan Bhagwat: దేశం విశ్వగురువుగా ఎదిగేందుకు ధర్మాన్ని ఆశ్రయించాలి: మోహన్ భగవత్

ABN , Publish Date - Jan 18 , 2026 | 07:10 PM

ముంబైలో తాజాగా నిర్వహించిన విహార్ సేవక్ ఉర్జా మిలన్ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ధర్మం గురించి ఉపన్యసించారు. భారతదేశం విశ్వగురువుగా ఎదిగేందుకు ధర్మాన్ని ఆశ్రయించాలని, మన ఆధ్యాత్మిక పరిజ్ఞానం ప్రపంచానికి చాలా అవసరం అని పేర్కొన్నారు.

RSS Mohan Bhagwat: దేశం విశ్వగురువుగా ఎదిగేందుకు ధర్మాన్ని ఆశ్రయించాలి: మోహన్ భగవత్
Mohan Bhagwat

భారతదేశం విశ్వగురువుగా ఎదిగేందుకు ధర్మాన్ని ఆశ్రయించాలని, మన ఆధ్యాత్మిక పరిజ్ఞానం ప్రపంచానికి చాలా అవసరం అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. ముంబైలో తాజాగా నిర్వహించిన 'విహార్ సేవక్ ఉర్జా మిలన్' కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ధర్మం గురించి ఉపన్యసించారు (Dharma and society).


'ధర్మం అనే సూత్రం ప్రపంచాన్ని నడిపిస్తోంది. ధర్మం పైనే ప్రతి విషయం ఆధారపడి ఉంది. ఆ ఆధ్యాత్మిక వారసత్వం పూర్వీకుల నుంచి మనకు లభించింది. మతాన్ని ఆచరిస్తూ సత్యానికి కట్టుబడి ఉండే సాధువుల సూచనలను మన దేశం పాటిస్తోంది. భారతదేశం విశ్వగురువుగా ఎదిగేందుకు ధర్మాన్ని ఆశ్రయించాలి. మన ఆధ్యాత్మిక పరిజ్ఞానం ప్రపంచానికి చాలా అవసరం' అని మోహన్ భగవత్ పేర్కొన్నారు (Dharma values India).


ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మనందరినీ ధర్మం అనే చోదక శక్తి నడిపిస్తోందని, ధర్మం అనే వాహనంలో ప్రయాణిస్తే ప్రమాదాలు ఎన్నటికీ జరగవని మోహన్ భగవత్ అన్నారు (RSS chief speech). ఏ జీవి కూడా ధర్మానికి అతీతంగా మనుగడ సాగించలేదని అభిప్రాయపడ్డారు.


ఇవి కూడా చదవండి..

వార్నీ.. రీల్స్ కోసం ఇంతకు తెగిస్తారా.. మెట్రో రైల్లో ఎగిరి తంతే..


మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో ఉన్న ముగ్గురిని 30 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 18 , 2026 | 08:51 PM